మునుపెన్నడూ లేని టెక్నాలజీతో దూసుకొస్తున్న సరికొత్త స్మార్ట్‌‌ఫోన్

|

మొబైల్ రంగంలో దూసుకుపోతున్న చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ దిగ్గజం వివో మునుపెన్నడూ లేని టెక్నాలజీతో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. కొత్త టెక్నాలజీ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌తో ఈ డివైస్‌ను లాంచ్‌ చేస్తోంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ స్కానింగ్‌ టెక్నాలజీతో లాంచ్‌ కానున్న తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇదేనని తెలిపాయి. ఇప్పటికే చైనా సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఫోన్‌ రెండు వెర్షన్‌లలో ఎక్స్‌ 21, ఎక్స్‌ 21 ప్లస్‌ యూడీ డివైస్‌లను ఇప్పటికే అందుబాటులో ఉంచింది. ఇండియన్‌ మార్కెట్‌లో ఏ పేరుతో విడుదల చేయనుందీ స్పష్టత లేదు. అయితే ఈ నెల 29న ఈ మొబైల్ ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే అందరికీ ఆహ్వానాలు పంపింది.

 

రైల్వే స్టేషన్‌లో వచ్చే ఉచిత వైఫై ఓ కూలి వాడి జీవితాన్ని మార్చేసిందిరైల్వే స్టేషన్‌లో వచ్చే ఉచిత వైఫై ఓ కూలి వాడి జీవితాన్ని మార్చేసింది

Vivo X21 UD ఫీచర్లు ( అంచనా)

Vivo X21 UD ఫీచర్లు ( అంచనా)

6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

అచ్చం ఆపిల్ ఐఫోన్ X ను పోలిన విధంగా..

అచ్చం ఆపిల్ ఐఫోన్ X ను పోలిన విధంగా..

కాగా ఈ వివో నుంచి వచ్చిన Vivo X21 స్మార్ట్‌ఫోన్‌ అచ్చం ఆపిల్ ఐఫోన్ X ను పోలిన విధంగా ఉండే డిజైన్‌తో వచ్చింది. 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో రూ.29,870, రూ.32,960 ధరలకు ఈ ఫోన్ అక్కడ లభిస్తోంది. మరి ఇదే ఫోన్ ఇండియాలో Vivo X21 UD పేరుతో లాంచ్ చేస్తుందనే అంచనా. అయితే ఇండియాలో దీని ధర ఎంతనేది ఇంకా తెలియలేదు.

6.28 ఇంచుల భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లే..
 

6.28 ఇంచుల భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లే..

వివో ఎక్స్21 స్మార్ట్‌ఫోన్‌లో 6.28 ఇంచుల భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభిస్తుంది. ఇక ఈ ఫోన్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే డిస్‌ప్లే కింది వైపు లోపలి భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫీచర్లే అందులో ఉండే అవకాశం ఉంది.

ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్..

ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్..

దీని వల్ల డిస్‌ప్లే పైనే యూజర్లు చేతి వేలితో ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దీంతో డివైస్ అన్‌లాక్ అవుతుంది. దీన్ని ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అని వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లు యూజర్లకు లభిస్తున్నాయి.

ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్తో

ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్తో

ఫింగర్‌ ప్రింట్‌ స్కానింగ్ టెక్నాలజీ అభివృద్ధిలో తాము మార్గదర్శిగా ఉన్నామని వివో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలెక్స్ ఫెంగ్ చెప్పారు. ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్తో వినియోగదారులకి ఈ ఫ్యూచరిస్టిక్ మొబైల్ అనుభవాన్ని అందించడంలో అడుగు ముందుకు వేశామనీ, చాలా త్వరగా వినియోగదారులకు అందుబాటులోకి రావటానికి చాలా సంతోషిస్తున్నామన్నారు.

Best Mobiles in India

English summary
Vivo X21 UD expected to launch in India on May 29 More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X