Home
Mobile

Iphone Xకి జెరాక్స్‌ని దించిన వివో, ఒప్పో, Vivo X21 బెస్ట్ ఫీచర్లు ఇవే !

చైనా మొబైల్ దిగ్గజం వివో ఇండియా మార్కెట్లో సత్తా చాటేందుకు రెడీ అయింది. కంపెనీ నుంచి సరికొత్త ఫోన్లు మార్కెట్లోకి దూసుకువస్తున్నాయి.

By Hazarath Aiah

చైనా మొబైల్ దిగ్గజం వివో ఇండియా మార్కెట్లో సత్తా చాటేందుకు రెడీ అయింది. కంపెనీ నుంచి సరికొత్త ఫోన్లు మార్కెట్లోకి దూసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆపిల్ ఐఫోన్ X ను పోలిన విధంగా ఉండే డిజైన్‌తో Vivo X21ని మార్కెట్లోకి దించింది. కాగా ఈ ఫోన్ ధర కూడా ఐఫోన్ ఎక్స్ కన్నా సగం ధరకే లభిస్తోంది. 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో రూ.29,870, రూ.32,960 ధరలకు ఈ ఫోన్ లభ్యం కానుంది. కాగా ఈ ఫోన్లో 6.28 ఇంచుల భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభిస్తుంది. ఇక ఈ ఫోన్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే డిస్‌ప్లే కింది వైపు లోపలి భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల డిస్‌ప్లే పైనే యూజర్లు చేతి వేలితో ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దీంతో డివైస్ అన్‌లాక్ అవుతుంది. దీన్ని ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అని వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లు యూజర్లకు లభిస్తున్నాయి.

vivo x21

వివో ఎక్స్21 ఫీచర్లు
6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

ఇదిలా ఉంటే మార్కెట్లోకి మరో దిగ్గజం ఒప్పో కూడా తన నూతన స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఆర్15ను చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. కాగా త్వరలో ఈ ఫోన్ భారత మార్కెట్‌లోనూ అందుబాటులోకి రానుంది. రూ.30,800 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో ఐఫోన్ 10 తరహాలో డిస్‌ప్లే పై భాగంలో నాచ్‌ను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.

ఒప్పో ఆర్15 ఫీచర్లు
6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3450 ఎంఏహెచ్ బ్యాటరీ, వీవోవోసీ ఫ్లాష్ చార్జింగ్.

Best Mobiles in India

English summary
Vivo X21 with an under-display fingerprint sensor launched in China More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X