Home
Mobile

200MP కెమెరా, 1.5K డిస్‌ప్లే, వైర్‌లెస్‌ ఛార్జింగ్ తో Vivo ఫోన్లు.. విడుదల తేదీ, స్పెసిఫికేషన్‌ల వివరాలు

వివో నుంచి త్వరలో రెండు స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ కానున్నాయి. వివో X300 సిరీస్‌ పేరుతో గ్లోబల్‌ మార్కెట్లో విడుదల కానున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా వివో x300, X300 ప్రో మోడల్స్‌ ఉన్నాయి. ఇటీవలే ఈ సిరీస్‌ చైనా సహా కొన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ సిరీస్‌ ఫోన్‌లు తొలిసారిగా మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌ని కలిగి ఉన్నాయి.

వివో X300 సిరీస్‌ (Vivo X300 Series Smartphones) యూరప్‌ మార్కెట్‌లో అక్టోబర్‌ 30 వ తేదీన విడుదల కానుంది. భారత్ మార్కెట్‌లో ఈ వివో సిరీస్‌ నవంబర్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వివో X300 ఫోన్ ప్రారంభ ధర రూ.70,000 గా ఉండే అవకాశం ఉంది. అదే ప్రో మోడల్‌ ధర సుమారుగా రూ.లక్ష గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Vivo X300 and X300 Pro Smartphones

వివో X300 సిరీస్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు :
ఇప్పటికే ఈ సిరీస్‌ చైనాలో విడుదల అయిన నేపథ్యంలో స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు వెల్లడయ్యాయి. వివో X300 స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.31 అంగుళాల BOE Q10+ LTPO OLED ప్లాట్‌ 1.5K డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అదే X300 ప్రో మోడల్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల BOE Q10+ LTPO OLED ప్లాట్‌ 1.5K మైక్రో కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. డిజైన్ పరంగాను ఈ హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకుంటుంది.

ఈ రెండు ఫోన్‌లు వీడియోటెక్‌ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. క్వాల్‌కాం నుంచి ఇటీవలే లాంచ్‌ అయిన క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 8 ఇలైట్ జెన్‌ 5 చిప్‌తో సమానమైన పనితీరును అందిస్తుందని చెబుతోంది. ఈ చిప్‌సెట్‌ LPDDR5x ర్యామ్, UFS 4.0 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తుంది.

Vivo X300 and X300 Pro Smartphones

200MP కెమెరాతోపాటు :
కెమెరా విభాగం పరంగా Zeiss తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. X300 స్మార్ట్‌ఫోన్‌ 200MP శాంసంగ్ HPB ప్రైమరీ కెమెరా, 50MP శాంసంగ్‌ JN1 అల్ట్రావైడ్‌ లెన్స్‌, 50MP సోనీ LYT 602 పెరిస్కోప్‌ కెమెరాను కలిగి ఉంటుంది. ముందువైపు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

అదే ప్రో మోడల్‌ 50MP సోనీ LYT 828 (OIS) కెమెరా, 50MP శాంసంగ్ JN1 అల్ట్రావైడ్‌ సెన్సర్‌ మరియు OIS సపోర్టుతో 200MP పెరిస్కోప్‌ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP శాంసంగ్‌ JN1 కెమెరాను కలిగి ఉంటుంది.

మరింత మెరుగైన కలర్‌ కోసం ఈ ఫోన్‌లు Zeiss T లెన్స్‌ కోటింగ్ మరియు V1, V3+ ఇమేజింగ్ చిప్‌సెట్‌లను కూడా కలిగి ఉంటుంది. ఫలితంగా తక్కువ వెలుగులోనూ మెరుగైన ఫోటోగ్రఫీ, పొర్ట్రెయిట్‌ మోడల్‌ ఫోటోలను క్యాప్చర్‌ చేయవచ్చు.

బ్యాటరీ వివరాలు :
వివో X300 స్మార్ట్‌ఫోన్ 90W వైర్‌ ఛార్జింగ్‌, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్టుతో 6040mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అదే ప్రో మోడల్‌ 90W వైర్‌ ఛార్జింగ్‌, 40W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6510mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo X300 and X300 Pro Smartphones confirmed to launch on october 30 globally
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X