కీలక మార్పులతో వివో X300 FE స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, ధర వివరాలు..?
Vivo X300 FE Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ నుంచి 2025 డిసెంబర్ తొలివారంలో వివో X300 సిరీస్ విడుదల అయింది. ఈ సిరీస్‌లో భాగంగా వివో X300, వివో X300 ప్రో మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే త్వరలో వివో నుంచి మరో ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. వివో X300 FE పేరుతో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. అయితే వివో నుంచి ఈ హ్యాండ్‌సెట్ విడుదలపై ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.
సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో :
వివో X300 FE స్మార్ట్‌ఫోన్ BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో V2537 మోడల్ నంబర్‌తో ఇటీవలే లిస్టింగ్ అయింది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన అన్‌బాక్సింగ్ వీడియో ద్వారా అనేక వివరాలు లీక్ అయ్యాయి. Beebom ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి.

అయితే ఈ వీడియో వివో S50 ప్రో మినీ స్మార్ట్‌ఫోన్ చైనా వేరియంట్‌కు సంబంధించినది. ఈ మోడల్ భారత్ మార్కెట్‌లో వివో X300 FE స్మార్ట్‌ఫోన్ పేరుతో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఈ వీడియో ఆధారంగా వివో X200 FE తో పోలిస్తే.. X300 FE మరింత మెరుగైన డిజైన్‌తో అందుబాటులోకి వస్తుంది.
డిజైన్ మార్పులు :
ఈ ఫోన్ కలర్ ఛేంజింగ్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. బ్యాక్ ప్యానల్‌పై కాంతి ప్రసారం ఆధారంగా రంగులు మార్చుకుంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ కెమెరా మాడ్యూల్ Horizontal గా ఉంటుంది. పిక్సల్, ఐఫోన్ ఎయిర్ మోడల్ కెమెరా డిజైన్‌ను పోలి ఉంటుందని తెలుస్తోంది.
ఈ వివో X300 FE స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.31 అంగుళాల 1.5K LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది. భద్రత కోసం అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుంది.
స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్! :
వివో X300 FE స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 SoC చిప్‌సెట్ తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ చిప్ 16GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుందని సమాచారం. గత సంవత్సరం విడుదల అయిన X200 FE ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్‌తో లాంచ్ అయింది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ 129fps గేమింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ 90W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది.
50MP ప్రైమరీ కెమెరా :
ఈ ఫోన్ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 50MP సోనీ IMX882 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 50MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
ఎంత ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది? :
చైనా మార్కెట్‌లో వివో S50 ప్రో మినీ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర 3699 Yuan (భారత కరెన్సీ ప్రకారం రూ.47,400) గా ఉంది. అయితే వివో X300 FE స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో ప్రారంభ ధర రూ.56999, రూ.59999 గా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
గత సంవత్సరం విడుదల అయిన వివో X200 FE స్మార్ట్‌ఫోన్ రూ.54999 ధరకు విడుదల అయింది. సుమారు రూ. 2 వేల నుంచి రూ.5 వేల అధిక ధరకు విడుదల కానుందని తెలుస్తోంది. అయితే వివో X300 FE స్మార్ట్‌ఫోన్ విడుదల సమయం సహా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లపై వివో ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








