వివో X300 సిరీస్ స్మార్ట్‌ఫోన్ విడుదలపై వివో కీలక ప్రకటన.. పూర్తి వివరాలు..!
Vivo X300 Series india launch : వివో X300 సిరీస్ స్మార్ట్‌ఫోన్ లు భారత్ మార్కెట్ లో త్వరలో విడుదల కానుంది. అయితే కచ్చితంగా ఎప్పుడు విడుదల కానుందనే వివరాలు వెల్లడి కాలేదు. గత నెలలో వివో X300, ప్రో మోడల్స్ చైనా సహా యూరప్ మార్కెట్ లో లాంచ్ అయ్యాయి. యూరప్ మార్కెట్ లో గత నెలలో లాంచ్ అయిన ప్రో మోడల్ ఫోన్ 100x డిజిటల్ జూమ్ తో 200MP కెమెరాను కలిగి ఉంది.
ఈ డిసెంబర్ నెలలో విడుదల అయ్యే అవకాశం! :
వివో ఇండియా X పోస్ట్ ఆధారంగా త్వరలోనే భారత్ లో వివో నుంచి త్వరలో X300 సిరీస్ విడుదల కానుంది. అయితే ఈ సిరీస్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు సహా ఎప్పుడు లాంచ్ కానుందనే వివరాలను వివో వెల్లడించలేదు. అయితే ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ సిరీస్ అంచనా వివరాలు :
వివో X300, వివో X300 ప్రో గ్లోబల్ వేరియంట్స్ తరహాలోనే భారత్ లోనూ స్పెసిఫికేషన్‌లు ఉండే అవకాశం ఉంది. దీని ఆధారంగా X300 స్మార్ట్‌ఫోన్ 6.31 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉండే ఉంటుందని తెలుస్తోంది. 120Hz రీఫ్రెష్ రేట్, HDR సపోర్టు ఉండే అవకాశం ఉంది.
వివో X300 ఫోన్ :
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్ పైన పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. కెమెరా విభాగం పరంగా 200MP ప్రైమరీ, 50MP అల్ట్రావైడ్, 50MP పెరిస్కోప్ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ వేరియంట్ 90W వైర్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 5360mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
What once was beyond reach is now all yours to capture.
— vivo India (@Vivo_India) November 12, 2025
The #vivoX300Series.
Coming soon. #vivoIndia #GoIntoTheWild pic.twitter.com/5Cq8PmtH1R
వివో X300 ప్రో మోడల్ :
అదే X300 ప్రో మోడల్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.78 అంగుళాల (1260 x 2800 పిక్సల్స్) LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రో ఫోన్ 50MP ప్రైమరీ, 50MP అల్ట్రావైడ్, 100X డిజిటల్ జూమ్ తో 200MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది.
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్ పైన పనిచేసే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 90W వైర్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5440mAh బ్యాటరీతో పనిచేసే అవకాశం ఉంది. ఈ ఫోన్ మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
చైనాలో ఈ సిరీస్ ప్రారంభ ధర CNY 4399 (భారత్ కరెన్సీ ప్రకారం సుమారు రూ.58,400) గా ఉంది. అదే ప్రో వేరియంట్ ధర చైనాలో CNY 5299 (భారత్ కరెన్సీ ప్రకారం సుమారు రూ.65,900) గా ఉంది. అయితే భారత్ లో ఈ ఫోన్ ప్రారంభ ధర ఎంత ఉంటుంది. ఎన్ని స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుందనే వివరాలు వెల్లడి కాలేదు. త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








