డిసెంబర్‌లో వివో X300 సిరీస్ లాంచ్.. గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్లే ఉంటాయా..?
Vivo X300 Series india launch : వివో X300 సిరీస్ త్వరలో భారత్ మార్కెట్ లో త్వరలో లాంచ్ కానుంది. ఈ సిరీస్ లో భాగంగా X300, X300 ప్రో స్మార్ట్‌ఫోన్ లు విడుదల కానున్నాయి. తాజాగా ఈ సిరీస్ విడుదల వివరాలను వివో వెల్లడించింది. మరియు సేల్ వివరాలు కూడా వెల్లడయ్యాయి. ఈ సిరీస్ గ్లోబల్ వేరియంట్ తరహా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్‌లు 200MP కెమెరాలను కలిగి ఉన్నాయి.
వివో X300 సిరీస్ భారత్ మార్కెట్‌లో డిసెంబర్ 2 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఇప్పటికే ఈ రెండు మోడల్స్ గ్లోబల్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చాయి. ఈ స్మార్ట్‌ఫోన్ వివో ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది.

ఈ రెండు ఫోన్‌లు గ్లోబల్ వేరియంట్ తరహా ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు. గ్లోబల్ మార్కెట్‌లో ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర EUR 1399 (భారత కరెన్సీ ప్రకారం రూ.1,43,000) గా ఉంది. ప్రో మోడల్ EUR 1049 (భారత కరెన్సీ ప్రకారం సుమారుగా రూ.1,08,000) గా ఉంది. భారత్ మార్కెట్‌లో ఈ సిరీస్ ప్రారంభ ధర రూ.1,00,000 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
వివో X300 స్మార్ట్‌ఫోన్ :
వివో X300 స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ వేరియంట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.31 అంగుళాల Q10+ అమోలెడ్ ప్యానల్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ LPDDR5x ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది.
కెమెరా విభాగం పరంగా 200MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్, 50MP పెరిస్కోప్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 90W వైర్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5360mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
వివో X300 ప్రో స్మార్ట్‌ఫోన్ :
వివో X300 ప్రో స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ వేరియంట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల ఫ్లాట్ Q10+ LTPO అమోలెడ్ డిస్‌ప్లే ను కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ LPDDR5x ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది.
కెమెరా విభాగం పరంగా ప్రో మోడల్ 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ లెన్స్ మరియు 100x డిజిటల్ జూమ్‌తో 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. ఈ మోడల్ 90W వైర్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5440mAh బ్యాటరీని కలిగి ఉంది.
వివో X300 సిరీస్ డిసెంబర్ నెలలో విడుదల కానుంది. సేల్ వివరాలు కూడా వెల్లడయ్యాయి. ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో ఈ ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. అయితే త్వరలో ఈ సిరీస్ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








