200MP కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్, వైర్‌లైస్ ఛార్జింగ్ సపోర్టుతో వివో X300 ఫోన్ విడుదల!
Vivo X300 Smartphone : వివో X300 సిరీస్ భారత్ మార్కెట్‌లో లాంచ్ అయింది. ఈ సిరీస్ లో వివో X300, X300 ప్రో మోడల్స్ లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్ గత నెలలో చైనా మార్కెట్‌లో విడుదల అయింది. ఈ సిరీస్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 16, 200MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. వివో X300 హ్యాండ్‌సెట్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల పూర్తి వివరాలు.
వివో X300 స్మార్ట్‌ఫోన్ :
ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.31 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, HDR సపోర్టును పొందుతుంది. ఈ వివో ఫోన్ IP68, IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది.

7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ వివో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్ 16GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తుంది. 5 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
200MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా Zeiss భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 200MP ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 50MP JN1 వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 3x ఆప్టికల్ జూమ్, OIS సపోర్టుతో 50MP సోనీ IMX885 LYT-602 కెమెరాను కలిగి ఉంది.

సెల్ఫీ, వీడియా కాల్స్ కోసం 50MP కెమెరాను అమర్చి ఉంది. ఈ ఫోన్ ముందు, వైనుక కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తాయి. 90W వైర్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 6040mAh లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంది.
ఈ ఫోన్ 5G, 4G, బ్లూటూత్ 6, Wi-Fi, GPS, OTG, NFC, USB-C ఛార్జింగ్ పోర్టు ఉన్నాయి. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సమ్మిట్ రెడ్, మిస్ట్ బ్లూ, ఇలైట్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. అనేక AI ఫీచర్లు కూడా ఉన్నాయి.

వివో X300 స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ :
ఈ స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.75999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.81999, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ రూ.85999 గా ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇవాళ్టి నుంచే వివో ఇండియా వెబ్‌సైట్ ద్వారా ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 10 వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది. SBI, HDFC బ్యాంకు కార్డులపై 10 శాతం క్యాష్‌బ్యాక్ తోపాటు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. వివో Zeiss 2.35x టెలిఫోటో ఎక్స్‌టెండర్ కిట్ ను రూ.18999 ధరకు కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








