10GB RAMతో మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్, ఫీచర్లు, ధరపై ఓ లుక్కేయండి !

ఆకట్టుకునే ఫీచర్లతో ఎప్పడికప్పుడూ కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసే చైనా మొబైల్ దిగ్గజం వివో ప్రపంచ మొబైల్ మార్కెట్‌కి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

|

ఆకట్టుకునే ఫీచర్లతో ఎప్పడికప్పుడూ కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసే చైనా మొబైల్ దిగ్గజం వివో ప్రపంచ మొబైల్ మార్కెట్‌కి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. స్మార్ట్‌ఫోన్‌ చరిత్రలోనే తొలిసారిగా 10 జిబి ర్యామ్‌తో ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఎక్స్‌ప్లే 7 పేరిట రానున్న ఈ ఫోన్లో ఫీచర్లన్నీ భారీగానే ఉండనున్నట్లు సమాచారం. కాగా ఈ ఫోన్ స్పెషిఫికేషన్లు, ఇమేజ్‌లు ప్రస్తుతం నెట్‌లో లీకయ్యాయి. సోషల్ మీడియాలో లీకయిన వార్తల ప్రకారం వివో ఎక్స్‌ప్లే 7 స్మార్ట్‌ఫోన్‌లో 10జీబీ భారీ ర్యామ్‌తోపాటు 256జీబీ, 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఉండనున్నట్లు తెలుస్తున్నది. అలాగే ఈ ఫోన్‌లో కొన్ని లీకయిన ఫీచర్లు యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఊహించని ధరకే 3జిబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్, అదనంగా రూ. 2,200 క్యాష్‌బ్యాక్ఊహించని ధరకే 3జిబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్, అదనంగా రూ. 2,200 క్యాష్‌బ్యాక్

ఈ లీక్‌లు కనుక నిజమైతే..

ఈ లీక్‌లు కనుక నిజమైతే..

ఈ లీక్‌లు కనుక నిజమైతే, ఎప్పటి వరకు వచ్చిన స్మార్ట్‌ఫోన్లలో ఇదే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 4కే ఓలెడ్‌ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 845 ఎస్‌ఓసీ, 512 జీబీ స్టోరేజ్‌, అండర్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ వంటి అద్భుత పీచర్లతో పాటు 4ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్‌తో డ్యూయల్‌ రియర్‌ కెమెరాను ఇది కలిగి ఉందని లీకేజీలు చెబుతున్నాయి.

256జీబీ, 512జీబీ రెండు స్టోరేజ్‌ వేరియంట్లలో..

256జీబీ, 512జీబీ రెండు స్టోరేజ్‌ వేరియంట్లలో..

10జీబీ ర్యామ్‌ కలిగిన ఈ ఫోన్‌ 256జీబీ, 512జీబీ రెండు స్టోరేజ్‌ వేరియంట్లలో రాబోతుందని తెలుస్తోంది. అయితే ధర, అందుబాటులో ఉండే వివరాలపై ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ప్రారంభ ధర 500 డాలర్లకు అంటే రూ.31,800కు దీన్ని లాంచ్‌ చేస్తారని టాక్‌.

అండర్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌తో

అండర్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌తో

10 జీబీ ర్యామ్‌ తో పాటు అండర్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌తో వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్‌ కూడా ఇదే కావడం విశేషం. అండర్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌తో వివో ఇటీవలే ఎక్స్‌ 20 ప్లస్‌ యూడీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే.

 వివో ఎక్స్‌ప్లే 6కు..

వివో ఎక్స్‌ప్లే 6కు..

2016లో లాంచ్‌ చేసిన వివో ఎక్స్‌ప్లే 6కు సక్సెసర్‌గా దీన్ని తీసుకురాబోతుంది. స్పెషిఫికేషన్ల విషయంలోనూ 2018 బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్లలో ఇదీ ఒకటిగా నిలువనుందనే టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. మరిని వివరాలు అతి త్వరలో తెలిసే అవకాశం ఉంది.

వివో ఎక్స్‌ప్లే 6 ఫీచర్లు

వివో ఎక్స్‌ప్లే 6 ఫీచర్లు

దీని ధర రూ. 44,000గా ఉంది
5.46 క్వాడ్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, అడ్రినో 530 గ్రాఫిక్స్
6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు
16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ
వైఫై 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్, బ్లూటూత్ 4.2
4080 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

Best Mobiles in India

English summary
Vivo Xplay 7 may be the first smartphone to launch with 10GB RAM More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X