Home
Mobile

64MP కెమెరా, 5000mAh బ్యాటరీతో Vivo స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. ఫీచర్లు, సేల్‌ వివరాలు..!

వివో కొత్త Y సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. వివో Y100T స్మార్ట్‌ఫోన్‌ (Vivo Y100T Smartphone) తాజాగా లాంచ్‌ చేశారు. ఈ హ్యాండ్‌సెట్‌ మూడు రంగుల్లో అందుబాటులోకి ఉంటుంది మరియు ఆండ్రాయిడ్ 13 ఆధారిత OriginOS పైన పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 120Hz ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో మరియు 12GB ర్యామ్‌తో వచ్చింది.

వివో Y100T స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : వివో V100t స్మార్ట్‌ఫోన్‌ 6.64 అంగుళాల పుల్‌ HD+ LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. 1080*2388 పిక్సల్‌ రిజల్యూషన్‌తో వస్తుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్‌ 4nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 8200 చిప్‌సెట్‌ మరియు ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత OriginOS పైన పనిచేస్తుంది.

Vivo Y100T Smartphone launched  in china

వివో Y100T కెమెరాలు : ఈ కొత్త వివో స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆపిక్టల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) ఫీచర్‌ సపోర్టు సహా f/1.79 అపేచర్‌తో 64MP కెమెరా, అలాగే f/2.4 అపేచర్‌తో 2MP డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అలాగే సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను కలిగి ఉంటుంది.

వివో Y100t స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ 512GB స్టోరేజీ వరకు UFS 3.1 స్టోరేజీ, 12GB LPDDR5 ర్యామ్‌తో వస్తుంది.

కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ 5G, 4G LTE, వైఫై 6, బ్లూటూత్‌ 5.3, NFC, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టు మరియు 1,5mm హెడ్‌ఫోన్‌ ఆడియో జాక్‌ను కలిగి ఉంటుంది. వివో Y100T స్మార్ట్‌ఫోన్‌ భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ను కలిగి ఉంటుంది.

వివో V100t స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం చైనాలో మాత్రమే విడుదల అయింది. అక్కడ 8GB ర్యామ్ +256GB స్టోరేజీ ధర CNY 1449 (భారత కరెన్సీ ప్రకారం రూ.17,560) గా ఉంది. 12GB ర్యామ్‌ +256GB స్టోరేజీ వేరియంట్‌ ధర CNY 1649 (భారత కరెన్సీలో రూ.19,310), 12GB ర్యామ్‌ +512GB స్టోరేజీ వేరియంట్‌ ధర CNY 1849 (భారత కరెన్సీలో 21,660) గా ఉంది.

వివో Y100T స్మార్ట్‌ఫోన్‌ 120W సూపర్‌వోక్‌ ఛార్జింగ్‌ సపోర్టు, 65W USB-PD ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫిబ్రవరి 28 నుంచి చైనాలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది. ఫార్‌ మౌంటైన్‌ గ్రీన్‌, మూన్‌ షాడో బ్లాక్‌, స్నో వైట్‌ రంగుల్లో లభిస్తుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో లాంచ్‌ కానుందా లేదా అనే సమాచారం సంస్థ వెల్లడించలేదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Vivo Y100T Smartphone launched in china and sale starts from Feb 28
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X