Home
Mobile

వివో నుంచి మరో రెండు Y సిరీస్ ఫోన్‌లు.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు లీక్..!

వివో సంస్థ భారత్‌ మార్కెట్‌ లో ఇటీవల వివో Y51 ప్రో 5G మోడల్‌ లాంచ్ అయింది. అయితే త్వరలో Y సిరీస్‌ నుంచి మరిన్ని మోడల్స్‌ విడుదల కానున్నాయని తెలుస్తోంది. ఇటీవలే గ్లోబల్ మార్కెట్లో వివో Y21 5G (Vivo Y21 5G Smartphone), వివో Y11 5G (Vivo Y11 5G Smartphone) స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో భారత్‌ లోనూ ఈ హ్యాండ్‌సెట్‌లు లాంచ్‌ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అంచనా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు :
వివో Y21, Y11 మోడల్స్‌ గురించి తాజాగా అనేక వివరాలు లీక్‌ అయ్యాయి. 91mobiles రిపోర్టు, టిప్‌స్టర్‌ సుధన్షు అంబోర్‌ వివరాల ఆధారంగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు, మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌ ను కలిగి ఉంటాయి. ఈ చిప్‌ 8GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంటుందని తెలుస్తోంది.

Vivo Y11 5G  Y21 5G Smartphones

ఈ రెండు Y సిరీస్‌ మోడల్స్‌ ఆండ్రాయిడ్ 16 ఆధారిత originOS 6 పైన పనిచేస్తుందని లీక్స్ ఆధారంగా తెలుస్తోంది. ఈ రెండు మోడల్స్‌ 6.74 అంగుళాల LCD డిస్‌ప్లేతో విడుదల కానున్నాయని తెలుస్తోంది. 120Hz రీఫ్రెష్‌ రేట్, 1200 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్ తో పనిచేసే అవకాశం ఉంది.

6500mAh బ్యాటరీ! :
వివో Y11 5G స్మార్ట్‌ఫోన్‌ 15W ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. అదే Y21 5G మోడల్‌ 44W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. IP65 రేటింగ్‌ తో డస్ట్, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంటుందని తెలుస్తోంది.

కెమెరాల వివరాలు! :
కెమెరా విభాగం పరంగా వివో Y11 5G ఫోన్‌ 13MP ప్రైమరీ QVGA సెకండరీ లెన్స్‌, 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. అదే Y21 5G ఫోన్ వెనుక వైపు 50MP కెమెరా, QVGA సెకండరీ లెన్స్, 5MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.

ధరల అంచనా వివరాలు :
వివో Y11 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ రూ.14999, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16999 గా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ సన్‌షైన్‌ గోల్డ్‌, మిడ్‌నైట్‌ బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో లభించే అవకాశం ఉంది.

అదే వివో Y21 5G ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.18499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.20499, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.22499 గా ఉంటుందని భావిస్తున్నారు. ఛాంపెయిన్‌ గోల్డ్, మిడ్‌నైడ్‌ బ్లూ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుందని తెలుస్తోంది.

ఈ ఫోన్‌ల విడుదల, ధర, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలపై వివో ఇండియా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలో ఈ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo Y11 5G, Y21 5G Smartphones key specifications, features leaked in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X