వివోY15s బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అయింది!! బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్స్...

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ వివో ఇండియాలో నేడు వివోY15s (2021) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. గతేడాది సింగపూర్‌లో ప్రారంభమైన ఈ కొత్త వివో ఫోన్ వాటర్‌డ్రాప్-స్టైల్ డిస్‌ప్లే నాచ్‌తో మరియు డ్యూయల్ రియర్ కెమెరా ఫీచర్లను కలిగి ఉంది. ఇది గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ గో ఎడిషన్‌పై ఆధారపడి రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ యొక్క స్ట్రీమ్‌లైన్డ్ వెర్షన్. ఇది రెండు విభిన్న కలర్ ఎంపికలలో లభిస్తూ 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇండియా మార్కెట్ లో మోటో E40 మరియు రెడ్ మి10 ప్రైమ్ వంటి వాటికి పోటీగా విడుదలైన దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

వివోY15s (2021) స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

వివోY15s (2021) స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

భారతదేశంలో వివోY15s స్మార్ట్‌ఫోన్‌ కేవలం ఒకే ఒక వేరియంట్లో లాంచ్ అయింది. 3GB RAM + 32GB స్టోరేజ్ ఒకే ఒక వేరియంట్ లో లభించే దీని యొక్క ధర రూ.10,990. ఈ ఫోన్ మిస్టిక్ బ్లూ మరియు వేవ్ గ్రీన్ వంటి రెండు కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఇది నేటి నుండి వివో ఇండియా ఇ-స్టోర్‌తో పాటు దేశంలోని వివిధ రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయడానికి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

Samsung Galaxy S22సిరీస్ ఫోన్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి!! ధర చాలా ఎక్కువ...Samsung Galaxy S22సిరీస్ ఫోన్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి!! ధర చాలా ఎక్కువ...

వివోY15s స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్
 

వివోY15s స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

వివోY15s (2021) స్మార్ట్‌ఫోన్‌ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానైకి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి Funtouch OS 11.1తో ఆండ్రాయిడ్ 11 (Go ఎడిషన్) పై నడుస్తుంది. ఈ ఫోన్ 20:9 కారక నిష్పత్తితో 6.51-అంగుళాల HD+ (720x1,600 పిక్సెల్‌లు) IPS డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు 3GB RAMతో పాటు ఆక్టా-కోర్ మీడియా టెక్ హీలియో P35 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఫోటోలు మరియు వీడియోల కోసం వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది f/2.2 లెన్స్‌తో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. కెమెరా సెటప్‌లో 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందుభాగంలో f/2.0 లెన్స్‌తో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

టెలిగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌లో యూజర్ల కోసం అందుబాటులో గల ఉత్తేజకరమైన ఫీచర్లు ఇవే...టెలిగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌లో యూజర్ల కోసం అందుబాటులో గల ఉత్తేజకరమైన ఫీచర్లు ఇవే...

ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌

వివోY15s (2021) స్మార్ట్‌ఫోన్‌ 32GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఇది ప్రత్యేక మైక్రో SD కార్డ్ ద్వారా విస్తరణకు మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ v5.0, GPS/ A-GPS, FM రేడియో, మైక్రో-USB పోర్ట్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్‌లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడా వస్తుంది. ఇది సాధారణ 10W ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అంతేకాకుండా ఇది 163.96x75.2x8.28mm కొలతల పరిమాణంతో 179 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Vivo Y15s Smartphone Launched in India With 5000mAh Battery: Price, Specs, Sale Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X