Home
Mobile

Vivo నుంచి కొత్త బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ Vivo నుంచి కొత్త ఫోన్‌ విడుదల అయింది. భారత్ మార్కెట్‌లో Y సిరీస్‌ ఫోన్ల విస్తరణలో భాగంగా Vivo Y17s స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ HD+ డిస్‌ప్లే మరియు 50MP ప్రధాన కెమెరా, 5000mAh బ్యాటరీ సహా మరిన్ని స్పెసిఫికేషన్లు ఈ స్మార్ట్‌ఫోన్‌ కలిగి ఉంది.

వివో Y17s స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 4GB ర్యామ్ + 64GB అంతర్గత స్టోరేజీ, 4GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. మరియు ఈ ఫోన్‌ గ్లిట్టర్‌ పర్పల్‌, ఫారెస్ట్‌ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ఈ వివో కొత్త ఫోన్‌ (vivo New Phone)ను ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ మరియు ఆఫ్‌లైన్‌ స్టోర్లలోనూ అందుబాటులో ఉంటాయి.

Vivo Y17s 4G smartphon

వివో Y17s స్పెసిఫికేషన్లు : ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.56 అంగుళాల HD+ వాటర్‌ డ్రాప్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 720*1612 పిక్సల్‌ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ వివో కొత్త ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఫన్‌టచ్‌ OS 13పైన పనిచేస్తుంది. మరియు ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ హీలియో G85 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్‌ 64GB, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ IP54 రేటింగ్‌ డస్ట్‌, స్ప్లాష్‌ రెసిస్టెన్స్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌తో వస్తుంది. మరియు 15W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

Vivo Y17s 4G smartphon

వివో Y17s స్మార్ట్‌ఫోన్‌ కెమెరా విభాగానికి వస్తే.. వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటాయి. f/1.8 అపేచర్‌తో 50MP ప్రధాన కెమెరా, f/2.4 అపేచర్‌తో 2MP సెకండరీ కెమెరాతో వస్తుంది. ముందువైపు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను అమర్చారు.

కనెక్టివిటీ విషయానికి వస్తే.. 4G LTE, డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, బ్లూటూత్‌ 5.0, GPS, USB-C పోర్టు, 3.5mm ఆడియో జాక్‌ సహా మరెన్నో కీలక ఫీచర్లను వివో Y17s స్మార్ట్‌ఫోన్‌ కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ సహా ఆఫ్‌లైన్‌ స్టోర్లలోనూ కొనుగోలు చేయవచ్చు. 64GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ. 11,499 మరియు 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.12,499గా ఉంది.

* భారత్‌ మార్కెట్‌లో వివో తన V సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను కూడా విస్తరించనుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 4న Vivo V29, Vivo V29 Pro స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనుంది. ఈ ఫోన్లు వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటాయి. అరా లైట్‌, LED ఫ్లాష్‌తో రానున్నాయి. 3D పార్టికల్‌ టెక్నాలజీ ఫినిషింగ్‌ను కలిగి ఉంటాయి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo Y17s 4G smartphone launched in India under 12000 range
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X