6.56 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో వివో స్మార్ట్‌ఫోన్ విడుదల.. పూర్తి వివరాలు..!
వివో సంస్థ తన Y సిరీస్ స్మార్ట్ ఫోన్లను (Vivo Y18e Smartphone Launched) భారత్ మార్కెట్‌లో క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా వివో V18e స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ హ్యాండ్ సెట్ వివో ఇండియా వెబ్ సైట్‌లో కనిపిస్తోంది. అయితే గ్రీన్ మరియు బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
వివో Y18e స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు :
వివో Y18e స్మార్ట్ ఫోన్ 6.56 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 720*1612 పిక్సల్ రిజల్యూషన్, 90Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. 185 గ్రాముల బరువుతో పాలి కార్పోనేట్ బాడీతో రూపొందించారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత funtouch OS పైన పనిచేస్తుంది.

ఈ వివో కొత్త హ్యాండ్ సెట్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో G85 చిప్ సెట్ పైన పనిచేస్తుంది. మరియు 4GB ర్యామ్‌తో జతచేయబడి ఉంది. అదనంగా 4GB ర్యామ్‌ను వర్చువల్‌గా పొడిగించుకోవచ్చు. దీంతోపాటు ఈ ఫోన్ 64GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకోవచ్చు.
5000mAh బ్యాటరీ సామర్థ్యం :
కెమెరాల పరంగా f/2.2 అపేచర్‌తో 13MP ప్రైమరీ కెమెరా, 0.08MP సెకండరీ కెమెరాను కలిగి ఉంటుంది. మరియు f/2.2 అపేచర్‌తో 5MP కెమెరాలను కలిగి ఉంటుంది. వెనుకవైపు ప్లాష్ లైట్‌ను కలిగి ఉంది. అలాగే ఈ హ్యాండ్‌సెట్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

వివో Y18e కనెక్టివిటీ ఫీచర్లు :
కనెక్టివిటీ పరంగా వివో Y18e స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్ కార్టు, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, GPS. FM రేడియో, USB-C, 3.5 అంగుళాల ఆడియో జాక్‌ను కలిగి ఉంది. IP54 రేటింగ్‌టో వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌గా లాంచ్ అయింది.
వివో Y18e స్మార్ట్ ఫోన్ వివో ఇండియా అధికారిక వెబ్ సైట్‌లో లిస్టింగ్ చేయబడింది. అయితే ధర సహా ఎప్పటి నుంచి భారత్‌లో అందుబాటులోకి వస్తుందనే వివరాలు వెల్లడించలేదు. గ్రీన్, బ్లాక్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. సేల్ వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
మే 2వ తేదీన భారత్‌లో వివో v30e స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. 6.78 అంగుళాల పుల్ HD+ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 120Hz రీఫ్రెష్ రేట్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత FuntouchOS 14 పైన పనిచేస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని సమాచారం.
కెమెరా విభాగం పరంగా ఈ వివో కొత్త హ్యాండ్ సెట్ వృత్తాకార కెమెరా మాడ్యుల్‌ను కలిగి ఉంటుంది. వెనుక వైపు డ్యూయల్ కెమెరాలు సహా ఫ్లాష్ లైట్‌తో లాంచ్ కానుంది. 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు సెల్ఫీ, వీడియోల కోసం 32MP కెమెరాతో లాంచ్ కానుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications