ధర రూ.9499 కే 50MP కెమెరా, 128GB స్టోరేజీ, 5000mAh బ్యాటరీ Vivo స్మార్ట్‌ఫోన్.. సేల్ ప్రారంభం..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ల తయారీ సంస్థ వివో భారత్ మార్కెట్‌లో (Vivo India) ఎంట్రీ లెవల్ హ్యాండ్‌సెట్ ను విడుదల చేసింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా కొత్త Y సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ వివో Y18t పేరుతో (Vivo Y18t Smartphone Launched) విడుదల అయింది. ఒకే స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. మరియు రూ.10,000 కంటే తక్కువ ధరకు లభించనుంది. డిజైన్ పరంగాను ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకుంటుంది. వివో Y18t స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, ధర, సేల్ పూర్తి వివరాలు.
వివో Y18t స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
వివో కొత్త Y సిరీస్ హ్యాండ్ సెట్ 6.56 అంగుళాల HD+ డిస్‌ప్లే ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్ రేట్, 269 పిక్సల్ డెన్సిటీ, 840 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 720*1612 పిక్సల్స్ రిజల్యూషన్‌తో అందుబాటులో ఉంది.

వివో Y18t స్మార్ట్‌ఫోన్ Unisoc T612 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 4GB LPDDR4X ర్యామ్ మరియు eMMC 5.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ర్యామ్‌ను అదనంగా 8GB వరకు పొడిగించుకొనే అవకాశం ఉంది. దీంతోపాటు మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పొడిగించుకొనే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 ను కలిగి ఉంది.
50MP ప్రైమరీ కెమెరా : ఈ వివో హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలతో అందుబాటులో ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 0.08 MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం వివో Y18t స్మార్ట్‌ఫోన్ 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
62.53 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైం : ఈ స్మార్ట్‌ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. సంస్థ వివరాల ఆధారంగా సింగిల్ ఛార్జింగ్ ద్వారా 62.53 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైంను పొందవచ్చు. కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ Wi-Fi, బ్లూటూత్ 5.2, OTG, GPS, USB-C, FM రేడియో వంటి మరిన్ని ఫీచర్‌లను కలిగి ఉంది.
దీంతోపాటు యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కాంపాస్, మోటార్ గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సెలిరోమీటర్ సెన్సార్‌లతో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 185 గ్రాముల బరువును కలిగి ఉంది. మరియు భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అందుపాటులో ఉంది.
వివో Y18t స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
ఈ వివో స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీలోనే భారత్ మార్కెట్‌లో లభిస్తుంది. ఈ మోడల్ ధర రూ.9499 గా ఉంది. ప్రస్తుతం వివో ఇండియా స్టోర్ మరియు ఫ్లిప్‌కార్ట్‌లో (Vivo Y18t Smartphone Sale in india) కొనుగోలు చేయవచ్చు. జెమ్ గ్రీన్ మరియు స్పేస్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








