రూ.10499 ధరకే 5500mAh బ్యాటరీ, 6.74 అంగుళాల HD+ డిస్‌ప్లే vivo 5G స్మార్ట్‌ఫోన్!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో తాజాగా ఎంట్రీ లెవల్ ధరలో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇవాళ భారత్ మార్కెట్‌లో వివో Y19 5G స్మార్ట్‌ఫోన్‌ను (Vivo Y19 5G Smartphone) విడుదల చేసింది. తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చినా మెరుగైన డిజైన్ సహా ఫీచర్‌లను కలిగి ఉంది. వివో కొత్త Y సిరీస్ స్మార్ట్‌ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు. రూ.10 వేల ధరలో 5G ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఈ ఫోన్ అనుకూలంగా ఉంటుంది.
మెటాలిక్ మ్యాటీ ఫ్రేమ్ :
వివో Y19 5G స్మార్ట్‌ఫోన్ క్రిస్టల్ టెక్చర్ తో కూడిన మెటాలిక్ మ్యాటీ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. ఈ డిజైన్ యూజర్లను ఆకట్టుకొనే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 8.19 mm థిక్‌నెస్‌ను కలిగి ఉంటుంది. మరియు కేవలం 199 గ్రాముల బరువుతో లాంచ్ అయింది.

వివో స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే వివరాలు :
ఈ వివో స్మార్ట్‌ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఎక్కువ సమయంలో ఫోన్ వినియోగించినా కళ్లకు హాని కలగకుండా ఉండేందుకు TUV Rheinland సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ IP64 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ 6GB ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంది. మూడు స్టోరేజీ వేరియంట్స్‌లో ఈ ఫోన్ విడుదల అయింది.
ఈ ఫోన్ 15W ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. మెరుగైన పనితీరు కోసం ఈ ఫోన్ స్మార్ట్ ఛార్జింగ్ ఇంజిన్ 2.0 ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్విస్ SGS 5 స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ వెనుక వైపు 13MP కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ వెనుక వైపు ఉన్న కెమెరాలు ప్రో, పొర్ట్రెయిట్, నైడ్ మోడ్‌ను సపోర్టు చేస్తాయి. దీంతోపాటు AI డాక్యుమెంట్, AI Photo Enhance, AI Erase వంటి AI ఫీచర్‌లను కలిగి ఉన్నాయి.
వివో Y19 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
వివో Y19 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ రూ.10499 గా ఉంది. ఈ ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11499 గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12999 గా ఉంది.
ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. వివో ఇండియా ఇ-స్టోర్‌తోపాటు ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మెజిస్టిక్ గ్రీన్ , టైటానియం సిల్వర్ రెండు రంగుల్లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








