Home
Mobile

5500mAh బ్యాటరీ, 50MP కెమెరా, IP64 రేటింగ్‌తో Vivo స్మార్ట్‌ఫోన్‌.. ధర, ఫీచర్‌ల పూర్తి వివరాలు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో ఇటీవల Y19s స్మార్ట్‌ఫోన్‌ను (Vivo Y19s Smartphone) ఆవిష్కరించింది. అయితే తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌ ధర సహా ఇతర వివరాలను వెల్లడించింది. ఈ ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్‌ లలో అందుబాటులో ఉంటుంది. మరియు ఆకర్షణీయ డిజైన్‌ ను కలిగి ఉంది. భారీ బ్యాటరీతో అందుబాటులో ఉంది. దీంతోపాటు ముఖ్యంగా ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా MIL-STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్‌ ల పూర్తి వివరాలు.

వివో Y19S స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ల వివరాలు :

ఈ వివో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ 6.68 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 720*1608 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 264 ppi పిక్సల్‌ డెన్సిటీని కలిగి ఉంది. మరియు మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ తో అందుబాటులో ఉంది.

Vivo Y19s Smartphone

ఆండ్రాయిడ్‌ 14 OS : వివో Y19s స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 పైన పనిచేస్తుంది. మరియు 12nm ఆక్టాకోర్‌ Unisoc T612 ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ 6GB LPDDR4x ర్యామ్ మరియు 128GB eMMC 5.1 అంతర్గత స్టోరేజీతో జతచేసి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ మూడు వేరియంట్‌ లలో అందుబాటులో ఉంటుందని వివో తెలిపింది. 4GB ర్యామ్‌ + 64GB స్టోరేజీ మరియు 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యా్మ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ ప్రస్తుతం థాయ్‌లాండ్‌లోనే అందుబాటులో ఉంది. అక్కడ ప్రారంభ ధర THB 3999 (భారత కరెన్సీ ప్రకారం RS9800) గా ఉంది.

Vivo Y19s Smartphone

ధర వివరాలు : అదే 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర THB 4399 (భారత కరెన్సీ ప్రకారం రూ.11,000), 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర THB 4999 (భారత కరెన్సీ ప్రకారం 12,200) గా ఉంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ భారత్‌ లో విడుదలపై ఎటువంటి స్పష్టత లేదు.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచర్‌తో 50MP ప్రధాన కెమెరా, f/3.0 అపేచర్‌తో 0.08MP కెమెరాను అమర్చి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందు వైపు ఈ హ్యాండ్‌సెట్‌ 5MP కెమెరాను కలిగి ఉంది. 15W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

IP64 రేటింగ్, ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ : వివో హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు స్ప్లాష్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ ఉంది. కనెక్టివిటీ 4G LTE, బ్లూటూత్ 5.2, వైఫై, USB-C ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంది. గ్లేసియర్ సిల్వర్‌, గ్లోసీ బ్లాక్‌, పెర్ల్‌ సిల్వర్‌ రంగుల్లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo Y19s Smartphone price and storage variants revealed features, specs details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X