వివో నుంచి Y200 Pro 5G స్మార్ట్‌ఫోన్.. టీజర్ విడుదల.. భారత్‌లో లాంచ్ తేదీ ఖరారు..!!
ప్రముఖ స్మా్ర్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో నుంచి త్వరలో మరో హ్యాండ్‌సెట్ విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన టీజర్‌ను సంస్థ విడుదల చేసింది. మే 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు వివో Y200 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను (Vivo Y200 Pro 5G Smartphone) లాంచ్ చేస్తున్నట్లు వివో ఇండియా తెలిపింది.
సిల్క్ గ్లాస్ డిజైన్ :
వివో Y200 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ విడుదలకు ముందు ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన అనేక వివరాలు బయటకువచ్చాయి. టీజర్ ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ సిల్క్ గ్లాస్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది.

3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే :
వివో Y200 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో కూడిన 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ స్నాప్ డ్రాగన్ 695 5G చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని వివో వెల్లడించింది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది.
మెరుగైన కెమెరా ఫీచర్లు :
దీంతోపాటు ఈ వివో Y200 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ కెమెరా విభాగం పరంగా కీలక ఫీచర్లను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), యాంటీ షేక్ కెమెరా సహా నైట్ ఫొటోగ్రఫీ, పొర్ట్రెయిట్ వంటి ఫీచర్లతో విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ వివో V29e అప్‌డేటెడ్ వెర్షన్‌గా విడుదల కానుందని తెలుస్తోంది.
వివో V29e స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు :
వివో V29e స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల పుల్ HD డిస్‌ప్లేను కలిగి ఉంది. 120 రీఫ్రెష్ రేట్, గరిష్ఠంగా 1300 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత Funtouch 13, క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది.
వివో V29e స్మార్ట్ ఫోన్ OIS సపోర్టుతో 64MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ కెమెరాను కలిగి ఉంది. 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ఈ హ్యాండ్‌సెట్ రెండు వేరియంట్లలో విడుదల అయింది. 8GB ర్యా్మ్ + 128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యా్మ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఆర్టిస్టిక్ రెడ్, ఆర్టిస్టిక్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








