Home
Mobile

6.78 అంగుళాల భారీ డిస్‌ప్లే, 64MP కెమెరాతో వివో 5G స్మార్ట్‌ఫోన్ విడుదల.. బ్యాంకు కార్డులపై రూ.2500 తగ్గింపు!

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ వివో ఇవాళ తన Y సిరీస్‌ హ్యాండ్‌ సెట్‌ ను విడుదల చేసింది. వివో Y200 ప్రో 5G స్మార్ట్‌ ఫోన్‌ (Vivo Y200 Pro 5G Smartphone Launched) భారత్‌లో లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ 6.78 అంగుళాల కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 64MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది.

వివో Y200 ప్రో 5G స్పెసిఫికేషన్లు :
వివో Y200 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల పుల్‌ HD+ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1300 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో లాంచ్‌ అయింది. వివో సంస్థ మేక్‌ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ వివో Y200 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ గ్రేటర్‌ నోయిడాలో తయారు చేసినట్లు సంస్థ వెల్లడించింది.

Vivo Y200 Pro 5G Smartphone launched

ఈ హ్యాండ్‌సెట్‌ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 695 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఈ చిప్‌ Adreno 619 GPU జతచేయబడుతుంది. మరియు 8GB LPDDR4x ర్యామ్‌తో అదనంగా 8GB ర్యామ్‌ను అదనంగా విస్తరించుకోవచ్చు. దీంతోపాటు ఈ వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత FuntouchOS 14 పైన పనిచేస్తుంది.

ఈ వివో Y200 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 44W ఫ్లాష్‌ ఛార్జ్‌తో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నాలుగు సంవత్సరాలపాటు బ్యాటరీ సమర్థవంతంగా పనిచేస్తుందని వివో తెలిపింది. బ్యాటరీ హెల్త్‌పై హామీ ఇచ్చింది. ఫలితంగా బ్యాటరీ ఎక్కువ రోజుల మన్నికతోపాటు మెరుగైన పనితీరును కనబరుస్తుందని తెలుస్తోంది.

64MP ప్రైమరీ కెమెరా : కెమెరా విభాగం పరంగా ఈ వివో కొత్త హ్యాండ్‌సెట్‌ OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టు మరియు 2X పోర్ట్రెయిట్‌తో 64MP ప్రైమరీ కెమెరా, 2MP బొకేష్‌ లెన్‌తో లాంచ్ అయింది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను కలిగి ఉంటుంది.

కనెక్టివిటీ పరంగా వివో y200 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్‌ సిమ్‌, 5G, బ్లూటూత్‌ 5.1, USB-C, GPS వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. మరియు భద్రత కోసం ఇన్‌- డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, IP54 రేటింగ్‌తో వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్‌గా వస్తుంది.

వివో Y200 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ ధర
వివో Y200 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.24,999 గా ఉంది. ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్, వివో అధికారిక వెబ్‌సైట్‌ మరియు రిటైల్‌ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. SBI, IDFC ఫస్ట్‌ బ్యాంక్, Indusind, ఫెడరల్ బ్యాంకు ద్వారా కొనుగోలు చేస్తే రూ.2500 తగ్గింపును పొందవచ్చు.

దీంతోపాటు రోజుకు రూ.45 చెల్లించి కూడా ఈ హ్యాండ్‌సెట్‌ను సొంతం చేసుకోవచ్చు. ఫలితంగా V షీల్డ్‌ ప్రాటెక్షన్‌ ను పొందవచ్చు. ఈ వివో Y200 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ సిల్క్‌ గ్రీన్‌ మరియు సిల్క్‌ బ్లాక్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo Y200 Pro 5G Smartphone launched in india with 6.78 inch large display
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X