Home
Mobile

వివో నుంచి కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌.. ధర వివరాలు లీక్‌.. త్వరలో భారత్‌ మార్కెట్‌లోకి విడుదల..!!

వివో నుంచి త్వరలో వివో Y200 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ( Vivo Y200 Pro Smartphone ) విడుదల కానుంది. అయితే సంస్థ మాత్రం భారత్‌లో విడుదలపై ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ హ్యాండ్‌ సెట్‌కు సంబంధించిన అనేక స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు ఇప్పటికే లీక్‌ అయ్యాయి. తాజాగా ఈ స్మార్ట్‌ ఫోన్ ధర వివరాలు వెల్లడయ్యాయి.

స్నాప్‌ డ్రాగన్‌ 695 చిప్‌ సెట్‌ :
91మొబైల్స్‌ నివేదిక ప్రకారం వివో Y200 ప్రో స్మార్ట్‌ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో సన్నని 3D కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు స్నాప్‌ డ్రాగన్‌ 695 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. అలాగే రూ.25,000 కంటే తక్కువ ధరకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

Vivo Y200 Pro smartphone

ఈ హ్యాండ్‌సెట్‌కు రీబ్రాండెడ్‌గా! :
ఈ హ్యాండ్‌ సెట్ ఇటీవల బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ సర్టిఫికేషన్‌ వెబ్‌ సైట్‌లో V2401 మోడల్‌ నంబర్‌తో కనిపించింది. ఫలితంగా భారత్‌ మార్కెట్‌లో విడుదల కానుందని ధ్రువీకరించినట్లు అవుతుంది. ఈ హ్యాండ్‌ సెట్ ఇటీవల భారత్‌లో విడుదల అయిన వివో V29e స్మార్ట్‌ ఫోన్‌కు రీబ్రాండెడ్‌గా విడుదల కానుందని తెలుస్తోంది.

దీంతోపాటు మరికొన్ని నివేదికల ప్రకారం.. వివో Y200 ప్రో ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టు సహా యాంటీ షేక్‌ కెమెరా పనితీరును కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే బ్యాటరీ సహా ర్యామ్‌, స్టోరేజీ మరియు పైన పేర్కొన్న వివరాలపై సంస్థ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.

Vivo Y200 Pro smartphone

వివో V29e స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు :
వివో V29e స్మార్ట్‌ ఫోన్ 6.78 అంగుళాల పుల్‌ HD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120 రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. గరిష్ఠంగా 1300 నిట్స్‌ బ్రైట్‌నెస్ను కలిగి ఉంటుంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 695 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత Funtouch 13 ను కలిగి ఉంటుంది.

వివో V29e స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్లలో ఈ ఫోన్ విడుదల అయింది. 8GB ర్యా్మ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యా్మ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఆర్టిస్టిక్‌ రెడ్‌, ఆర్టిస్టిక్‌ బ్లూ రంగుల్లో ఈ ఫోన్‌ లభిస్తుంది.

వివో V29e స్మార్ట్‌ ఫోన్‌ OIS సపోర్టుతో 64MP ప్రైమరీ సెన్సార్‌, 8MP అల్ట్రా వైడ్ కెమెరాను కలిగి ఉంది. 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 44W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo Y200 Pro smartphone expected to launch in india here are the leaked details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X