ధర రూ.13999 కే 50MP కెమెరా, 128GB స్టోరేజీ Vivo స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్‌లు, సేల్ పూర్తి వివరాలు..!
వివో సంస్థ తన Y సిరీస్‌ను క్రమంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా భారత్ మార్కెట్‌లోకి వివో Y28s మరియు Y28e స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు (Vivo Y series 5G Smartphones Launched) తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతోపాటు మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. వివో Y28s స్మార్ట్‌ఫోన్ 50MP సోనీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
వివో Y28s స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు :
వివో Y28s స్మార్ట్‌ఫోన్ (Vivo Y28s Smartphone) 6.56 HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రీఫ్రెష్ రేట్‌తో లాంచ్ అయింది. ఈ డిస్‌ప్లే TUV రీన్‌ల్యాండ్ బ్లూ లైట్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. 15W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

మీడియాటెక్ చిప్‌సెట్ :
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 5G చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 8GB ర్యామ్ మరియు 128GB అంతర్గత స్టోరేజీతో జతచేయబడింది.
50MP సోనీ IMX 852 కెమెరా :
కెమెరా విభాగం పరంగా వివో Y28s స్మార్ట్‌ఫోన్ 50MP సోనీ IMX 852 కెమెరా సహా మరో కెమెరాను కలిగి ఉంది. సూపర్ నైట్ కెమెరా మోడ్, మల్టీ స్టైల్ పొర్ట్రెయిట్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు.

ఈ స్మార్ట్‌ఫోన్ మూడు ర్యామ్, స్టోరేజీ వేరియంట్‌లో ఉంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15499, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16999 గా ఉంది. వింటేజ్ రెడ్ మరియు ట్విక్లింగ్ పర్పుల్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.
వివో Y28e స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు :
వివో Y28e స్మార్ట్‌ఫోన్ (Vivo Y28e Smartphone) 6.56 అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే రీన్‌ల్యాండ్ బ్లూ లైట్ సర్టిఫికేషన్ ను పొందింది. ఈ స్మార్ట్‌ఫోన్ 15W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 5G చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజీతో జతచేయబడి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 పైన పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 13MP ప్రైమరీ కెమెరా సహా మరో కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు 5MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.
ఈ స్మార్ట్‌ఫోన్ రెండు ర్యామ్, స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10999 గా ఉంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11999 గా ఉంది. వింటేజ్ రెడ్ మరియు బ్రీజ్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర రిటైల్ దుకాణాల్లో కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








