Home
Mobile

5000mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరా, IP64 రేటింగ్‌ 5G ఫోన్‌పై రూ.2000 డిస్కౌంట్‌..!

వివో బ్రాండ్‌ భారత్ మార్కెట్‌లో నమ్మకమైనదిగా గుర్తింపు పొందింది. వివో వివిధ సెగ్మెంట్స్‌లో ఇప్పటికే అనేక స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తోంది. ఇప్పటికే వివో V50 స్మార్ట్‌ఫోన్‌, వివో V50e హ్యాండ్‌సెట్‌ కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే గత సంవత్సరం జులై విడుదల అయిన వివో Y28s హ్యాండ్‌సెట్‌ను (Vivo Y28s Smartphone) ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ బడ్జెట్‌ రేంజ్‌లో అందుబాటులోకి వచ్చినా.. 5000mAh బ్యాటరీ. 50MP కెమెరాలను కలిగి ఉంది.

ధర, ఆఫర్‌ :
వివో Y28s స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది. విడుదల సమయంలో 4GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.13,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.12999 గా ఉంది. ‌అన్ని బ్యాంకుల క్రెడిట్‌ కార్డు లావాదేవీలపై రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్‌ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

vivo Y28s Smartphone gets price drop on flipkart  5000mAh battery  50MP camera

మూడు కలర్‌ వేరియంట్స్ :
ఫ్లిప్‌కార్ట్‌లో వివో Y28s స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ +128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,299, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.15,149 గా ఉంది. వింటేజ్ రెడ్‌, ట్వింక్వింగ్‌ పర్పుల్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

డిస్‌ప్లే వివరాలు :
వివో Y28s స్మార్ట్‌ఫోన్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.56 HD+ LCD డిస్‌ప్లేతో లభిస్తుంది. ఈ డిస్‌ప్లే 840 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌, 269 ppi పిక్సెల్‌ డెన్సిటీని కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే TUV Rheinland సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

చిప్‌సెట్‌, OS :
ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Funtouch OS 14 ను కలిగి ఉంటుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100 5G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ గరిష్ఠంగా 8GB ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పొడిగించుకోవచ్చు.

కెమెరాలు :
ఈ వివో స్మార్ట్‌ఫోన్‌ కెమెరా విభాగం పరంగా డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాతో అందుబాటులో ఉంది. ఈ కెమెరాలు పొర్ట్రెయిట్‌ మోడ్‌, నైట్‌ మోడ్‌, లైవ్‌ ఫోటో, ప్రో మోడ్‌ను సపోర్టు చేస్తుంది.

వివో Y28s స్మా‌ర్ట్‌ఫోన్‌ 15W ఫ్లాష్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌, వైఫై, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్‌ భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌తో అందుబాటులో ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.

వివో V50e స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ.28,999 గా ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.77 అంగుళాల FHD+ క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 4nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 SoC చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 తో పనిచేస్తుంది.

ఈ ఫోన్‌ 50MP, 8MP కెమెరాలతోపాటు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 90W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5600mAh బ్యాటరీతో పనిచేస్తోంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

Best Mobiles in India

English summary
vivo Y28s Smartphone gets price drop on flipkart, 5000mAh battery, 50MP camera
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X