Home
Mobile

ధర రూ.13,999 కే 50MP కెమెరా, 5500mAh బ్యాటరీ, 128GB స్టోరేజీ Vivo 5G స్మార్ట్‌ఫోన్‌..!

వివో నుంచి భారత్‌ మార్కెట్‌లోకి Y29 5G స్మార్ట్‌ఫోన్‌ (Vivo Y29 5G Smartphone Launched) ఇవాళ విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ స్లిమ్‌ ప్రొఫైల్‌తో పాటు అనేక సూపర్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ వివో 5G ఫోన్‌ బడ్జెట్‌ రేంజ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్‌ బరువు కేవలం 198 గ్రాములుగా ఉంది. ఈ వివో Y29 5G స్మార్ట్‌ఫోన్‌ మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌తో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లను గ్రేటర్‌ నోయిడాలోని వివో యూనిట్‌లో తయారు చేశారు.

వివో Y29 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ వివో 5G స్మార్ట్‌ఫోన్‌ 6.68 అంగుళాల LCD డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఎక్కువ సమయంపాటు వినియోగించినా కళ్లపై చెడు ప్రభావం చూపకుండే ఉండేలా TUV Rheinland సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

Vivo Y29 5G Smartphone launched with 50MP Camera and 5500mAh Battery in india

మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌, మీడియాటెక్‌ చిప్‌సెట్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత FuntouchOS 14 ను కలిగి ఉంది. మరియు మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మల్టీ టాస్కింగ్‌, వీడియో స్ట్రీమింగ్‌కు అనుకూలంగా ఉంటుందని వివో చెబుతోంది. నాలుగు వేరియంట్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా అంది.

నాలుగు స్టోరేజీ వేరియంట్లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో భారత్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని గరిష్ఠంగా 1TB వరకు పొడిగించేందుకు అవకాశం ఉంది.

50MP కెమెరా, 5500mh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరాతోపాటు 0.08MP డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను అమర్చారు. వెనుక కెమెరాలు నైట్‌ మోడ్‌, AI ఎరేజ్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 44W ఫ్లాష్‌ఛార్జ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది.

వివో Y29 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్ వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్‌ 4GB ర్యామ్ వేరియంట్ ధర రూ.13,999 గా ఉంది. అదే 6GB ర్యామ్ ధర రూ.15,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18,999 గా ఉంది. వివో స్మార్ట్‌ఫోన్‌ మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. గ్లేసియర్‌ బ్లూ, టైటానియం గోల్డ్‌, డైమండ్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం వివో అధికారిక స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. SBI కార్డు, DBS, IDFC ఫస్ట్‌ బ్యాంకు, యెస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఫెడరల్‌ బ్యాంక్‌, AU స్మాల్ ఫైనాన్స్‌ బ్యాంక్‌, J&K బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్ వంటి కార్డులపై రూ.1500 క్యాష్‌బ్యాక్‌ లేదా రూ.1399 చెల్లించి కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo Y29 5G Smartphone launched with 50MP Camera and 5500mAh Battery in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X