Home
Mobile

80W ఛార్జింగ్‌ సపోర్టు, 50MP సోనీ కెమెరా, 8GB ర్యామ్‌తో Vivo 5G ఫోన్‌ విడుదల.. ముందస్తు బుకింగ్‌ ప్రారంభం..!

వివో నుంచి భారత్‌ మార్కెట్‌లోకి వివో Y300 5G స్మార్ట్‌ఫోన్‌ (Vivo Y300 5G Smartphone Launched) విడుదల అయింది. రెండు స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. కెమెరా విభాగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. మరియు అడ్వాన్స్‌డ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కెమెరా ఫీచర్‌లను కలిగి ఉంటుంది. డిజైన్‌ పరంగా ఆకట్టుకుంటోంది. సోనీ ప్రైమరీ కెమెరా సహా 5000mAh బ్యాటరీతో భారత్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉంది.

వివో Y300 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
ఈ వివో హ్యాండ్‌సెట్‌ స్లీక్‌ డిజైన్‌తో (Vivo Y300 5G Specifications) అందుబాటులో ఉంది. మరియు పంచ్‌ హోల్‌ డిజైన్‌తో విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. SGS లో లైట్‌ ఐ కేర్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

Vivo Y300 5G Smartphone Launched

ఈ ఫోన్‌ 4nm స్నాప్‌డ్రాగన్ 4 జెన్‌ 2 చిప్‌సెట్‌ మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత FuntouchOS 14 తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ రెండు స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది. 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 2MP బొకేష్ కెమెరాలతో అందుబాటులో ఉంది. ఈ కెమెరాలు 2x పొర్ట్రియిట్‌ మోడ్‌, AI సూపర్ మూన్, సూపర్‌ నైట్‌ అల్గారిథమ్‌, స్టైలిష్‌ నైట్‌ వంటి ఫీచర్లు సహా AI Aura లైట్‌ను కలిగి ఉంది.

సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్‌ 32MP కెమెరాను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్‌ మరో సూపర్‌ కెమెరా ఫీచర్‌ను కలిగి ఉంది. డ్యూయల్ వ్యూ వీడియో ఫీచర్‌ తో ముందు, వెనుక కెమెరాలతో ఒకేసారి రికార్డు చేసేందుకు అవకాశం ఉంది. మరియు పిక్సర్‌ ఇన్‌ పిక్చర్‌ ఫార్మాట్‌ను సపోర్టు చేస్తుంది.

వివో Y300 5G స్మార్ట్‌ఫోన్‌ 80W ఫ్లాష్‌ ఛార్జ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. నాలుగు సంవత్సరాలపాటు బ్యాటరీ మెరుగైన పనితీరు కనబరుస్తుందని సంస్థ చెబుతోంది. AI Photo Enhance, AI Erase వంటి అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్‌ను కలిగి ఉంది.

ఈ వినో ఫోన్‌ IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. దీంతోపాటు వెట్‌ టచ్‌ టెక్నాలజీని కలిగి ఉంది. ఫలితంగా తడి చేతులతోనూ ఫోన్‌ని నియంత్రించవచ్చు. మరియు టైటానియం సిల్వర్‌, ఎమరాల్డ్‌ గ్రీన్‌, ఫాంటమ్‌ పర్పుల్‌ రంగుల్లో లభిస్తుంది.

వివో Y300 హ్యాండ్‌సెట్‌ 8GB ర్యా్మ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది. 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,999 గా ఉంది. సెప్టెంబర్‌ 26 వ తేదీ నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. వివో ఇండియా ఇ-స్టోర్‌, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇవాళ్టి నుంచి నవంబర్‌ 25 వరకు ముందస్తు బుకింగ్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంది.

SBI కార్డు, IDFC ఫస్ట్ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంకు, యెస్‌ బ్యాంకు, BOB కార్డ్‌, ఫెడరల్‌ బ్యాంక్ కార్డుల ద్వారా రూ.2000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. దీంతోపాటు మరో ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఇవాళ్టి నుంచి నవంబర్‌ 30 మధ్య వివో Y300 5G స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసిన యాజర్లు.. రూ.1499 కే వివో TWS 3e ఇయర్‌బడ్స్‌ను సొంతం చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Vivo Y300 5G Smartphone Launched with 80W FlashCharge and AI features in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X