Home
Mobile

వివో Y300 5G స్మార్ట్‌ఫోన్ ధర, స్టోరేజీ వివరాలు లీక్‌.. భారత్ మార్కెట్‌లో నవంబర్‌ 21న విడుదల..!

భారత్‌ మార్కెట్‌లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ల తయారీ సంస్థ వివో నుంచి కొత్త హ్యాండ్‌ సెట్ (Vivo India) విడుదల కానుంది. వివో Y300 5G హ్యాండ్‌ సెట్‌ (Vivo Y300 5G Smartphone Launch in india) నవంబర్ 21 న విడుదల కానుంది. ఇటీవల ఈ హ్యాండ్‌సెట్‌ డిజైన్ సహా కొన్ని వివరాలు వెల్లడయ్యాయి. అయితే తాజాగా ఓ నివేదిక ఈ హ్యాండ్‌సెట్ ధర సహ స్టోరేజీ వేరియంట్‌ వివరాలు లీక్‌ చేసింది. ఇటీవల విడుదలైన ఫోటోల ఆధారంగా ఈ హ్యాండ్‌ సెట్‌ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది.

వివో Y300 స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజీ వేరియంట్‌ అంచనా వివరాలు :
తాజాగా విడుదలైన నివేదికల ఆధారంగా ధర సహా స్టోరేజీ వేరియంట్‌ల వివరాలు వెల్లడయ్యాయి. 91మొబైల్స్‌ హిందీ నివేదిక ఆధారంగా వివో Y300 స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ మరియు 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుందని తెలుస్తోంది.

vivo Y300 5G Smartphone

వివో Y300 స్మార్ట్‌ఫోన్‌ ధర! :
ఈ హ్యాండ్‌సెట్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.21,000 నుంచి రూ.22,000 మధ్య ఉండే అవకాశం ఉంది. అదే హైఎండ్‌ మోడల్‌ ధర రూ.24,000 నుంచి రూ.25,000 గా ఉండే అవకాశం ఉంది. బ్యాంకు ఆఫర్‌తో కలిపి రూ.19,999 కే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ వివో Y300 5G స్మార్ట్‌ఫోన్‌ మూడు రంగుల్లో లభించే అవకాశం ఉంది. ఎమరాల్డ్‌ గ్రీన్‌, ఫాంటమ్‌ పర్పుల్‌, టైటానియం సిల్వర్‌ రంగుల్లో లభించే అవకాశం ఉంది. భారత్‌ మార్కెట్‌ లో నవంబర్‌ 21 మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్‌ కానుంది. వివో ఇండియా ఇ-స్టోర్‌ మరియు ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) ద్వారా సేల్‌ జరగనుంది.

వివో Y300 5G స్మార్ట్‌ఫోన్‌ అంచనా స్పెసిఫికేషన్‌లు : ఇప్పటికే వచ్చిన కొన్ని నివేదికల ఆధారంగా వివో Y300 5G స్మార్ట్‌ఫోన్‌ (Vivo New Y Series Smartphone) 6.7 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1200 నిట్స్‌ గరిష్ఠ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

వివో Y సిరీస్ కొత్త స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్‌ 2 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ 8GB ర్యామ్ మరియు గరిష్ఠంగా 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుందని సమాచారం. 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP సెల్ఫీ కెమెరాలతో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ Aura లైట్‌ రింగ్‌ సహా అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత స్పెసిఫికేషన్లను కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
vivo Y300 5G Smartphone price and Storage variants leaked ahead of launch on november 21 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X