Home
Mobile

రూ.20000 ధరలో మంచి కెమెరా స్మార్ట్‌ఫోన్‌ కోసం ఎదురుచూస్తుంటే.. ఇవాళ సేల్‌ ప్రారంభమైన ఫోన్‌ గురించి తెలుసుకోండి

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో నుంచి భారత్‌ మార్కెట్‌లోకి నవంబర్ 21వ తేదీన వివో Y300 స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకొనే డిజైన్‌తో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ సేల్‌ ఇవాళ ప్రారంభం (Vivo Y300 5G Smartphone Sale is live) అయింది. వివో ఇండియా ఇ-స్టోర్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. 50MP సోనీ IMX882 ప్రధాన కెమెరా సహా 32MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉన్నాయి. సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా గరిష్ఠంగా రూ.2,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

వివో Y300 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
వివో Y300 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 128GB స్టోరేజీ ధర రూ.21,999 గా ఉంది. అదే 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.23,999 గా ఉంది.

vivo Y300 5G Smartphone sale in india

ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ వివో ఇ-స్టోర్‌ సహా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో SBI, HDFC, ICICI కార్డులతో EMI రూపంలో ఈ స్మా్ర్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే గరిష్ఠంగా రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఇతర లావాదేవీలపై రూ.1000 తగ్గింపును పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో అన్ని బ్యాంకుల క్రెడిట్‌ కార్డులతో EMI రూపంలో కొనుగోలు చేస్తే రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదే ఇతర రూపాల్లో లావాదేవీలు నిర్వహిస్తే రూ.1000 తగ్గింపుతో వివో Y300 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఎమరాల్డ్‌ గ్రీన్‌, ఫాంటమ్‌ పర్పుల్‌, టైటానియం సిల్వర్ రంగుల్లో లభిస్తుంది.

vivo Y300 5G Smartphone sale in india

వివో Y300 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌ల వివరాలు :
వివో Y300 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. SGS Low లైట్‌ ఐ కేర్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. డిజైన్‌ పరంగా ఆకట్టుకొనే విధంగా ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత FuntouchOS 14 మరియు 4nm స్నాప్‌డ్రాగన్ 4 జెన్‌ 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.

ఈ వివో స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా విభాగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 2MP బొకేష్ కెమెరాలను కలిగి ఉంది. మరియు 32MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. వెనుక, ముందు కెమెరాలతో ఒకేసారి వీడియోను రికార్డు చేయవచ్చని సంస్థ చెబుతోంది.

ఈ హ్యాండ్‌సెట్‌ AI Photo Enhance, AI Erase అడ్వాన్స్‌డ్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా ఫీచర్‌లను కలిగి ఉంది. AI సూపర్ మూన్, సూపర్‌ నైట్‌ అల్గారిథమ్‌, 2x పొర్ట్రెయిట్‌ మోడ్‌, స్టైలిష్‌ నైట్‌ ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు AI Aura లైట్‌ను కలిగి ఉంది. మరియు పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌ ఫార్మాట్‌ను ఈ హ్యాండ్‌సెట్‌ సపోర్టు చేస్తుంది.

వివో Y300 5G స్మార్ట్‌ఫోన్‌ 80W ఫ్లాష్‌ ఛార్జ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌తో అందుబాటులో ఉంది. వెట్‌ టచ్‌ టెక్నాలజీని కలిగి ఉంది. ఫలితంగా తడి చేతులతోనూ ఫోన్‌ని నియంత్రించవచ్చు. డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, బ్లూటూత్‌ 5.0, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
vivo Y300 5G Smartphone sale is live in india check sale price and bank offers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X