Home
Mobile

6.78 అంగుళాల FHD డిస్‌ప్లే, 50MP కెమెరా, 44W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5G స్మార్ట్‌ఫోన్‌.. పూర్తి వివరాలు!

వివో నుంచి భారత్‌ మార్కెట్‌లోకి మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. వివో Y300 ప్లస్‌ పేరుతో హ్యాండ్‌సెట్‌ను లాంచ్‌ (Vivo Y300 Plus Smartphone Launched) చేసింది. ఈ హ్యాండ్‌సెట్ కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 44W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. డిజైన్‌ పరంగా ఆకర్షణీయంగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 8GB స్టోరేజీతో అందుబాటులో ఉంది. 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ను ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

వివో Y300 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
వివో Y300 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల FHD (1080*2400 పిక్సల్స్‌) 3D కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్, 1300 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Funtouch OS 14 ను కలిగి ఉంది.

Vivo Y300 Plus Smartphone launched

వివో స్మార్ట్‌ఫోన్‌ 6nm స్నాప్‌డ్రాగన్‌ 685 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 8GB LPDDR4X ర్యామ్ మరియు 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. 8GB వరకు అదనంగా ర్యామ్‌ను పొడిగించుకోవచ్చు. మైక్రో SD కార్డు ద్వారా గరిష్ఠంగా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ కేవలం ఒకే స్టోరేజీ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్‌లోనే భారత్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉంది.

50MP ప్రైమరీ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వివో స్మార్ట్‌ఫోన్‌ f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, f/2.4 అపేచర్‌తో 2MP కెమెరాలను కలిగి ఉంది. ముందువైపు సెల్పీ, వీడియో కాల్స్‌ కోసం f/2.45 అపేచర్‌తో 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్ 44W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

వివో Y300 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.1, Wi-Fi, OTG, USB-C ఛార్జింగ్ పోర్టు, GPS, Galileo, Glonass, Beidou, Navic వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు యాంబియంట్‌ లైట్‌ సెన్సార్‌, ఈ-కాంపాస్‌, గైరోస్కోప్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌, యాక్సెలిరోమీటర్‌ వంటి సెన్సార్‌లను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ భద్రత కోసం ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు IP54 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది. ఈ వివో Y300 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 183 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ డ్యూయల్‌ నానో సిమ్‌ కార్డుతో పనిచేస్తుంది.

వివో Y300 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ సేల్‌ :
వివో Y300 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ సింగిల్‌ వేరియంట్‌లోనే అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,999 గా ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను వివో ఇ-స్టోర్‌ లో కొనుగోలు చేయవచ్చు. ICICI, SBI, HDFC బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేసి రూ.1,000 తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్ సిల్క్‌ గ్రీన్‌, సిల్క్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo Y300 Plus Smartphone launched with 5000mAh Battery and 50MP Camera in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X