వివో నుంచి సూపర్ ఫీచర్‌లతో స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, లాంచ్ తేదీ లీక్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ల తయారీ సంస్థ వివో నుంచి ఇటీవల భారత్ మార్కెట్ లో (Vivo India) వివో V50, వివో T4x ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. త్వరలో వివో V50e హ్యాండ్‌సెట్ కూడా లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు లీక్ అయ్యాయి. అయితే త్వరలో వివో నుంచి మరో హ్యాండ్‌సెట్ లాంచ్ కానుందని తెలుస్తోంది. వివో Y300 సిరీస్‌లో కొత్త వేరియంట్ విడుదలయ్యే అవకాశం ఉంది.
కొత్త ఫోన్ లాంచ్! :
ఇప్పటికే ఈ సిరీస్‌లో Y300 5G, Y300 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. త్వరలో వివో Y300 ప్రో ప్లస్ లాంచ్ కానుందని తెలుస్తోంది. వివో Y300 సిరీస్‌లో ప్రస్తుతం ఉన్న మోడల్స్ తో పోలిస్తే త్వరలో లాంచ్ కానుందని భావిస్తున్న వివో Y300 ప్రో+ (Vivo Y300 Pro Plus Smartphone) శక్తివంతమైన చిప్‌సెట్, భారీ బ్యాటరీతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

లాంచ్ తేదీ లీక్ :
చైనాలో Y300 సిరీస్ లో ఇప్పటికే Y300, Y300 ప్రో, Y300i మోడల్స్ ఉన్నాయి. చైనా సోషల్ మీడియాలో లీక్స్ ఆధారంగా వివో V300 ప్రో+ స్మార్ట్‌ఫోన్ మార్చి 31 వ తేదీన విడుదల కానుందని తెలుస్తోంది. టిప్‌స్టర్ పాండా (weibo) ఆధారంగా ఈ ఫోన్ గురించి కొన్ని వివరాలు లీక్ అయ్యాయి.
స్పెసిఫికేషన్‌లు :
చైనాలో వివో Y300 ప్రో + స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరాతోపాటు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం. మరియు ఈ ఫోన్ 7320mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.
* భారత్ మార్కెట్‌లో వివో Y300 సిరీస్ లో Y300, Y300 ప్లస్ మోడల్స్ ఉన్నాయి. చైనాలో లాంచ్ కానుందని భావిస్తున్న Y300 ప్రో+ మోడల్.. భారత్ లో విడుదల కానుందా లేదా అనే వివరాలు వెల్లడి కాలేదు. మరియు ఎలాంటి లీక్స్ కూడా రాలేదు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
దీంతోపాటు వివో నుంచి X200 అల్ట్రా మోడల్ కూడా లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. వచ్చే నెలలోనే చైనా మార్కెట్‌లోకి విడుదల కానుందని తెలుస్తోంది. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఆధారంగా కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. ఈ ఫోన్ 6.82 అంగుళాలు LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం.
ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ లెన్స్, 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. తక్కువ వెలుగులోనూ నాణ్యమైన ఫోటోలు క్యాప్చర్ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. జూమ్ చేసినా ఫోటోలు స్పష్టంగానే ఉంటాయని తెలిపింది.
ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 90W వైర్ ఛార్జింగ్, 50MP వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని తో పనిచేసే అవకాశం ఉంది. ఈ ఫోన్ అల్ట్రా వైన్ రెడ్, బ్లాక్, వైట్ కలర్ వేరియంట్స్‌లో లభించే అవకాశం ఉంది. ఈ ఫోన్ భారత్ లో విడుదలపై స్పష్టత లేదు.


Click it and Unblock the Notifications








