వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. కీలక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు లీక్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో నుంచి త్వరలో వివో Y300 ప్రో (Vivo Y300 Pro) స్మార్ట్‌ఫోన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. చైనా సహా గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ కానుంది. తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన కీలక వివరాలు లీక్ అయ్యాయి. స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, 80W ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో మోడల్ నంబర్‌తో కనిపించింది.
మైస్మార్ట్‌ప్రైస్ రిపోర్టు ఆధారంగా వివో Y300 ప్రో స్మార్ట్‌ఫోన్ చైనా మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MIIT) సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో V2410A తో లిస్టింగ్ అయింది. ఈ లిస్టింగ్ ఆధారంగా 5G కనెక్టివిటీ మరియు డ్యూయల్ సిమ్ కార్డులను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది.

ఈ వివో Y300 ప్రో స్మార్ట్‌ఫోన్ ఇటీవల గీక్‌బెంచ్ వెబ్‌సైట్‌లో మోడల్ నంబర్ V2410A తో కనిపించింది. దీని ఆధారంగా ఆక్టాకోర్ చిప్‌సెట్ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్ ను కలిగి ఉంటుందని సమాచారం. ఈ చిప్‌సెట్ 12GB ర్యామ్‌తో జతచేయబడే అవకాశం ఉంది.
వివో Y300 ప్రో స్మార్ట్‌ఫోన్ సింగిల్ కోర్ టెస్ట్‌లో 942 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్‌లో 2801 పాయింట్లు సాధించింది. దీంతోపాటు చైనాకు 3C వెబ్‌సైట్ ఆధారంగా 80W ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది. 6500mAh బ్యాటరీతో పనిచేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
*భారత్ మార్కెట్‌లో ఆగస్టు 27న వివో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. సెప్టెంబర్ 3 నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఈ హ్యాండ్‌సెట్ 6.67 అంగుళాల కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 పైన పనిచేస్తుంది. మరియు స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. Adreno 720 HPU, 8GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేయబడుతుంది.
వివో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ IMX882 కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను అమర్చారు. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
వివో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.24,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది. శాండ్‌స్టోన్ ఆరెంజ్, ఎమరాల్డ్ గ్రీన్ రంగుల్లో లభించనుంది. సెప్టెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








