Home
Mobile

Vivo నుంచి త్వరలో మరో స్మార్ట్‌ఫోన్‌.. కలర్‌ వేరియంట్‌లు, లాంచ్‌ టైమ్‌లైన్‌ సహా కీలక వివరాలు లీక్‌.. !

ప్రస్తుతం భారత్‌ మార్కెట్‌లో వివో Y300 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంది. గత నెలలో ఈ హ్యాండ్‌సెట్ భారత్‌ మార్కెట్‌లో విడుదల అయింది. అయితే వివో Y300 హ్యాండ్‌సెట్‌ త్వరలో విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన కొన్ని వివరాలు తాజా లీక్‌ అయ్యాయి. వివో Y300 స్మార్ట్‌ఫోన్‌ (Vivo Y300 Smartphone) స్పెసిఫికేషన్‌లు, విడుదల వివరాలు, కలర్ వేరియంట్‌ల సమాచారం లీక్‌ అయింది. ప్రస్తుతం ఉన్న ప్లస్‌ మోడల్‌తో పోలిస్తే మెరుగైన ఫీచర్‌లతో అందుబాటులో రానుందని తెలుస్తోంది.

మైస్మార్ట్‌ప్రైస్‌ ఆధారంగా వివో Y300 స్మార్ట్‌ఫోన్‌ టైటానియం ఇన్ఫైరడ్‌ డిజైన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు మూడు రంగుల్లో లభిస్తుందని తెలుస్తోంది. ఫాంటమ్ పర్పుల్‌, టైటానియం సిల్వర్‌, ఎమరాల్డ్‌ గ్రీన్‌ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు ఛార్జింగ్, కెమెరా స్పెసిఫికేషన్‌లు కూడా లీక్‌ అయ్యాయి.

Vivo Y300 Smartphone latest news

ఈ లీక్‌లు, నివేదికల ఆధారంగా వివో Y300 స్మార్ట్‌ఫోన్‌ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు సోనీ IMX882 కెమెరా సహా AI Aura లైట్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ ఈ నెల చివర్లో భారత్‌ మార్కెట్‌లో విడుదల కానుందని తెలుస్తోంది. అయితే ఈ స్పెసిఫికేషన్‌లు, లాంచ్‌ టైమ్‌ లైన్‌ వివరాలపై వివో ఎటువంటి ప్రకటన చేయలేదు.

అయితే ఈ హ్యాండ్‌సెట్ ఎన్ని స్టోరేజీ వేరియంట్‌లో విడుదల కానుంది.. డిస్‌ప్లే, కెమెరా పూర్తి స్పెసిఫికేషన్‌లు సహా ధర వివరాలను వెల్లడి కావాల్సి ఉన్నాయి. మరియు ఎంత బ్యాటరీ సామర్థ్యంతో అందుబాటులోకి వస్తుందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న Y300 ప్లస్‌ కంటే మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

* ప్రస్తుతం భారత్‌ మార్కెట్లో వివో y300 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంది. కేవలం 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్లోనే లభిస్తోంది. ఈ వేరియంట్ ధర రూ.23,999 గా ఉంది. గ్రీన్‌, బ్లాక్ రెండు రంగుల్లో లభిస్తుంది. వివో ఇండియా స్టోర్‌ సహా అమెజాన్‌ లో కొనుగోలు చేయవచ్చు.

వివో Y300 ప్లస్‌ 6.78 అంగుళాల FHD+ 3D కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Funtouch OS 14, 6nm స్నాప్‌డ్రాగన్‌ 695 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. మైక్రో SD ద్వారా ఈ హ్యాండ్‌సెట్ స్టోరేజీని గరిష్ఠంగా 1TB వరకు పెంచుకోవచ్చు. 44W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా సహా 2MP కెమెరాలను అమర్చి ఉంటుంది. మరియు 32MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో రానుంది. అనేక కెమెరా ఫీచర్‌లను కలిగి ఉంటుంది. వెనుక కెమెరాలు నైట్‌, డ్యూయల్‌ వ్యూ, పొర్ట్రెయిట్‌, Pano, టైమ్‌ ల్యాప్స్‌ ఫీచర్‌లను సపోర్టు చేస్తాయి. సెల్ఫీ కెమెరాలు నైట్‌, పొర్ట్రెయిట్‌, డ్యూయల్‌ వ్యూ సపోర్టును కలిగి ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo Y300 Smartphone key specifications colour variants tipped and expected to launch end of the november 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X