వివో Y300 స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ వెల్లడి.. 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా సహా కీలక ఫీచర్‌లు..!
వివో Y300 స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీని సంస్థ తన X హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. భారత్ మార్కెట్‌లో ఇప్పటికే వివో Y300 ప్లస్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉండగా.. త్వరలో వివో Y300 హ్యాండ్‌సెట్ (Vivo Y300 Smartphone Launch Date) లాంచ్ కానుంది. ఇందుకు సంబంధించిన టీజర్‌ను లాంచ్ చేసింది. డిజైన్ సహా లాంచ్ ఇతర స్పెసిఫికేషన్‌ల వివరాలు వెల్లడయ్యాయి. డిజైన్ పరంగా హ్యాండ్‌సెట్ ఆకట్టుకుంటోంది. మెటాలిక్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. ఈ వివో కొత్త హ్యాండ్‌సెట్ Low Light ఫొటోగ్రఫీ ను సపోర్టు చేస్తుందని తెలిపింది.
వివో Y300 స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో నవంబర్ 21 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. అయితే గత మోడల్ (వివో Y200) తో పోలిస్తే డిజైన్‌లో అనేక మార్పులను గమనించవచ్చు. Y300 హ్యాండ్‌సెట్ బాక్సీ డిజైన్‌తో కూడిన మెటాలిక్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. వెనుక వైపు Aura లైట్‌తో అందుబాటులోకి రానుంది.

కొన్ని నివేదికల ఆధారంగా ఈ వివో టైటానియం తరహా మెటీరియల్‌తో స్లీక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు స్మార్ట్‌ఫోన్ మూడు రంగుల్లో లభిస్తుంది. డార్క్ పర్పుల్, సీ గ్రీన్ మరియు గ్రే రంగుల్లో అందుబాటులోకి రానుంది. రూ.25,000 ధరల సెగ్మెంట్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
వివో Y300 అంచనా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల FHD+ (1080*2400) అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌తో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌తో విడుదల అయ్యే అవకాశం ఉంది. మరియు 8GB ర్యామ్‌తో జతచేసి ఉంటుందని తెలుస్తోంది.
The style game just got bigger. Get ready to level up your style with none other than Suhana Khan.
— vivo India (@Vivo_India) November 14, 2024
Launching on 21st Nov, 12PM#vivoY300 #ItsMyStyle #vivoYSeries pic.twitter.com/yeHJg7SJMY
ఆండ్రాయిడ్ 14 80W, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు :
వివో Y300 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 ను కలిగి ఉంటుందని సమాచారం. అయితే స్టోరేజీ వేరియంట్‌ల వివరాలు తెలియాల్సి ఉంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
టీజర్ ఆధారంగా వివో Y300 స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 8MP సెకండరీ కెమెరాతో విడుదల అయ్యే అవకాశం ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాతో లాంచ్ కానుందని తెలుస్తోంది.
కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.0, Wi-FI 5, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది. మెరుగైన ఆడియో కోసం స్టీరియో స్పీకర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉండనుంది. దీంతోపాటు భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో విడుదలయ్యే అవకాశం ఉంది.
భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వివో Y300 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల FHD+ 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 6nm స్నాప్‌డ్రాగన్ 695 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 ను కలిగి ఉంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
ఈ ఫోన్ వెనుక వైపు 50MP + 2MP కెమెరాలు మరియు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. భారత్ మార్కెట్‌లో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,999 గా ఉంది. గ్రీన్, బ్లాక్ రెండు రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








