Home
Mobile

6500mAh బ్యాటరీ, 50MP కెమెరాతో వివో Y31 5G సిరీస్‌.. సేల్ ప్రారంభం!

వివో Y31 సిరీస్‌ (Vivo Y31 5G Series) భారత్‌లో విడుదల అయింది. ఇందులో వివో Y31 5G, వివో Y31 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లున్నాయి. 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో పనిచేస్తాయి. ఈ రెండు ఫోన్‌లు బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చాయి. IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉన్నాయి. ఈ వివో కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్లు ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి.

వివో Y31 5G స్మార్ట్‌ఫోన్‌ :
ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.68 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌, 264 PPI పిక్సల్‌ డెన్సిటీను కలిగి ఉంది. ఈ ఫోన్‌ డ్రీమీ వైట్‌, మోచా బ్రౌన్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Vivo Y31 5G series smartphones launched in india

ఈ హ్యాండ్‌సెట్‌ ఆక్టా కోర్ 4nm స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 6GB LPDDR4x ర్యామ్, 128GB eMMC 5.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తోంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 0.08MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ అండర్‌ వాటర్‌ ఫోటోగ్రఫీని సపోర్టు చేస్తుంది.

Vivo Y31 5G series smartphones launched in india

వివో Y31 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ హ్యండ్‌సెట్ 6.72 అంగుళాల LCD (2408 x 1080 పిక్సల్స్‌) డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1050 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 383 పిక్సల్‌ డెన్సిటీ కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 0.08MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ అండర్‌ వాటర్‌ ఫోటోగ్రఫీని సపోర్టు చేస్తుంది.

ఈ ప్రో మోడల్‌ 4nm ఆక్టా కోర్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తుంది.

వివో Y31 5G సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు 44W వైర్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తాయి. మరియు IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉన్నాయి. బ్లూటూత్‌ 4.1, వైఫై, GPS, OTG, USB-C ఛార్జింగ్ పోర్టు, ఇ-కంపాస్, ప్రాక్సిమిటి సెన్సర్‌, యాంబియంట్ లైట్‌ సెన్సర్‌, యాక్సెలిరోమీటర్‌ సెన్సర్‌ను కలిగి ఉంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను కలిగి ఉంటాయి.

Vivo Y31 5G series smartphones launched in india

వివో Y31 సిరీస్‌ ధర, సేల్‌ వివరాలు :
వివో Y31 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16499 గా ఉంది. ఈ ఫోన్‌ డైమండ్‌ గ్రీన్‌, రోజ్‌ రెడ్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

వివో Y31 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.20999 గా ఉంది. వివో ఇండియా వెబ్‌సైట్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Vivo Y31 5G series smartphones launched in india with 6500mAh battery, features and specs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X