Home
Mobile

రూ.15 వేల ధరలో 6500mAh భారీ బ్యాటరీ, IP68, IP69 రేటింగ్‌తో 5G ఫోన్!

Vivo Y31 5G : వివో సంస్థ భారత్‌ మార్కెట్‌లో గత నెలలో వివో Y31 5G సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇందులో వివో Y31 5G, వివో Y31 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. అయితే వివో Y31 ఫోన్‌ రూ.15 వేల ధరలో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ బడ్జెట్ ధరలో విడుదల అయినా అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. 50MP కెమెరా, 6500mAh బ్యాటరీ సహా IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

6.68 అంగుళాల డిస్‌ప్లే :
దీంతోపాటు ఆకట్టుకొనే డిజైన్‌, కలర్‌ వేరియంట్స్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 6.68 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 264 PPI పిక్సల్‌ డెన్సిటీని కలిగి ఉంది.

Vivo Y31 5G Smartphone with 6500mAh Battery  50MP camera available on flipkart

రూ.15 వేల కంటే తక్కువ ధరలో :
ఈ వివో స్మార్ట్‌ఫోన్‌ 4nm స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 SoC ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16499 గా ఉంది.

రెండు కలర్ వేరియంట్స్ :
ప్రస్తుతం ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై ఈ హ్యాండ్‌సెట్‌ను మరింత డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ రోజ్‌ రెడ్‌, డైమండ్‌ గ్రీన్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

50MP ప్రైమరీ కెమెరా, 6500mAh భారీ బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ 50MP ప్రైమరీ కెమెరా, 0.08MP సెకండరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 44W వైర్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

డస్ట్, వాటర్‌ రెసిస్టెంట్‌ :
ఈ వివో Y31 5G స్మార్ట్‌ఫోన్ IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 5G, 4G, బ్లూటూత్, WiFi, USB-C, GPS, OTG వంటి ఫీచర్లు ఉన్నాయి. యాంబియంట్ లైట్‌ సెన్సర్, యాక్సెలిరోమీటర్ సెన్సర్‌, ప్రాక్సిమిటీ సెన్సర్‌ లను కలిగి ఉంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ ను కలిగి ఉంది.

* ప్రో వేరియంట్‌ స్మార్ట్‌ఫోన్ :
ఈ సిరీస్‌లో భాగంగా లాంచ్ అయిన ప్రో మోడల్ 6.72 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ తో పనిచేస్తోంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తోంది. 44W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది.

ఈ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్‌ అండర్‌ వాటర్‌ ఫోటోగ్రఫీని కూడా సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.18999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.20999 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo Y31 5G Smartphone with 6500mAh Battery, 50MP camera available on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X