Home
Mobile

రూ.14999 ధరకు 6500mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, IP68 + IP69 రేటింగ్‌ ఫోన్‌!

వివో సంస్థ ఈ సంవత్సరం భారత్‌ మార్కెట్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఇందులో ఎంట్రీ లెవల్ మోడల్స్‌ నుంచి ఫ్లాగ్‌షిప్‌ మోడల్స్ వరకు ఉన్నాయి. ఈ సంవత్సరం రెండో భాగంలో వివో Y31 5G స్మా్ర్ట్‌ఫోన్ లాంచ్‌ అయింది. బడ్జెట్‌ ధరలో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 6500mAh బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల, సేల్‌ వివరాలు.

వివో Y31 5G స్మార్ట్‌ఫోన్‌ (Vivo Y31 5G Smartphone) ప్రస్తుతం వివో ఇండియా ఇ-స్టోర్‌ లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16499 గా ఉంది. HDFC, యాక్సెస్‌ బ్యాంకు కార్డులపై రూ.1000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

Vivo Y31 5G Smartphone

ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వివో Y31 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.68 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1000 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ రోజ్‌ రెడ్‌, డైమండ్‌ గ్రీన్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది

50MP కెమెరా :
ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 0.08MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చి ఉంది.

6500mAh బ్యాటరీ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 44W వైర్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఈ ఫోన్‌ సైడ్‌ మౌంటెడ్ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను అమర్చి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్, వైఫై, GPS, OTG, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు ప్రాక్సిమిటీ సెన్సర్‌, యాంబియంట్‌ లైట్‌ సెన్సర్‌, యాక్సెలిరోమీటర్‌ వంటి సెన్సర్‌లున్నాయి.

Vivo Y31 5G Smartphone

వివో X300 సిరీస్‌ :
భారత్‌లో ఇటీవల వివో X300 సిరీస్‌ విడుదల అయింది. ఇందులో వివో X300, X300 ప్రో మోడల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్‌లు 200MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తోంది.

ఈ ఫోన్‌ బేస్‌ వేరియంట్ 6.31 అంగుళాల 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లే, అదే ప్రో మోడల్‌ 6.78 అంగుళాల 1.5K LTPO అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. బేస్‌ వేరియంట్‌ 6040mAh లిథియం అయాన్‌ బ్యాటరీ, ప్రో వేరియంట్‌ 6510mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ సిరీస్‌ 90W వైర్, 40W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo Y31 5G Smartphone with 6500mAh battery now available at Rs14999 price vivo india e store
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X