స్లిమ్‌, స్టైలిష్ డిజైన్‌తో Vivo Y35 మొబైల్ భార‌త మార్కెట్లో విడుద‌ల‌!

|

చైనాకు చెందిన ప్ర‌ముఖ మొబైల్ ఉత్ప‌త్తుల త‌యారీ కంపెనీ వివో, భార‌త మార్కెట్లో క్ర‌మంగా త‌మ ఉత్ప‌త్తుల్ని విస్త‌రిస్తోంది. తాజాగా మ‌రో కొత్త మోడ‌ల్ మొబైల్‌ను భార‌త మార్కెట్‌కు ప‌రిచ‌యం చేసింది. స్లిమ్‌, స్టైలిష్ డిజైన్ క‌లిగిన Vivo Y35 మోడ‌ల్ మొబైల్‌ను భార‌త మార్కెట్లో విడుద‌ల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో క‌లిగి ఉంది.

vivo y35

అంతేకాకుండా, ఇది 5000mAh సామ‌ర్థ్యం క‌లిగిన బ్యాట‌రీతో పాటుగా, 44W ఫ్లాష్ ఛార్జ్ స‌పోర్టుతో వ‌స్తోంది. ఇక ర్యామ్ విష‌యానికొస్తే.. గ‌రిష్ఠంగా 8GB RAM అందిస్తున్నారు. అంతేకాకుండా, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS)తో కూడిన 50MP క్వాలిటీతో సూపర్ నైట్ కెమెరా క‌ల్పిస్తున్నారు.

భార‌త మార్కెట్లో Vivo Y35 ధ‌ర‌లు, ల‌భ్య‌త‌:
భార‌త మార్కెట్లో ఈ Vivo Y35 మొబైల్ కు సంబంధించి 8GB ర్యామ్ +128GB స్టోరేజీ వేరియంట్ ధరను రూ.18,499 నిర్ణ‌యించారు. Vivo ఇండియా ఇ-స్టోర్‌లో మరియు అన్ని భాగస్వామి రిటైల్ స్టోర్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారుల‌కు అందుబాటులోకి రానుంది. అగేట్ బ్లాక్ మరియు డాన్ గోల్డ్ సహా రెండు కలర్ వేరియంట్‌లలో ఇది అందుబాటులో ఉండ‌నుంది. అలాగే, vivo Y35 మొబైల్‌ను ICICI/SBI/Kotak / OneCard కార్డుల‌ను ఉప‌యోగించి కొనుగోలు చేయ‌డం ద్వారా ప్ర‌త్యేక ఆఫ‌ర్ కింద, రూ.1000 క్యాష్‌బ్యాక్ పొంద‌వ‌చ్చ‌ని కంపెనీ పేర్కొంది. ఈ ఆఫ‌ర్ సెప్టెంబర్ 30వ తేదీ, 2022 వరకు అందుబాటులో ఉంటుంద‌ని కంపెనీ పేర్కొంది.

vivo y35

Vivo Y35 స్పెసిఫికేష‌న్లు, ఫీచ‌ర్లు:
Vivo Y35 మొబైల్ స్పెసిఫికేష‌న్ల విష‌యానికొస్తే.. ఈ మొబైల్ స్లిమ్ మరియు స్టైలిష్ డిజైన్‌ను క‌లిగి ఉంది. దీనికి 6.58-అంగుళాల FHD+ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ యొక్క డిస్‌ప్లే ప్రకాశవంతమైన మరియు స్పష్టమైన రంగులను అందిస్తుంది. ఇది 2.5D కర్వ్డ్‌ కర్వేచర్‌తో ఫ్లాట్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది.

ఈ మొబైల్‌కు భద్రత కోసం ఫేస్ వేక్ ఫీచర్‌తో పాటు సైడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కూడా అందిస్తున్నారు. సమర్థవంతమైన అన్‌లాకింగ్ ఫీచ‌ర్‌ను క‌లిగి ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో శక్తివంతమైన పనితీరు క‌న‌బ‌రుస్తుంది. ఇక ఛార్జ్ విష‌యానికొస్తే.. దీనికి 5000mAh బ్యాటరీని అందిస్తున్నారు. ఇది 44W ఫ్లాష్ ఛార్జింగ్ స‌పోర్టుతో వ‌స్తోంది. అంతేకాకుండా, ఈ వివో Y35 మొబైల్ మల్టీ టర్బో మరియు అల్ట్రా గేమ్ మోడ్‌తో వస్తుంది. గేమింగ్‌పై ఆస‌క్తి ఉన్న వారికి ఇది గేమ్‌లో లీన‌మ‌య్యేలా మంచి అనుభూతిని క‌ల్పిస్తుంది.

అదేవిధంగా, ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్‌తో పాటుగా ఎక్స్‌టెండెడ్ ర్యామ్ 3.0 ఫీచర్‌తో వ‌స్తోంది. ఇక ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ విష‌యానికొస్తే.. 128GB స్టోరేజీని అందిస్తున్నారు. ఇది 1TB వరకు ఎక్స్‌ప్యాండ‌బుల్ (మెమరీ కార్డ్ ద్వారా) ఉంటుంది. సరికొత్త Y35 Android 12 ఆధారంగా రూపొందించబడిన తాజా FunTouch OS 12పై రన్ అవుతుంది.

vivo y35

కెమెరా ప్ర‌త్యేక‌త‌లు:
vivo Y35 స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో స్మార్ట్ ఫోటోగ్రఫీ అనుభవం కోసం 50MP ప్రధాన కెమెరా ఉంటుంది. అదేవిధంగా, 2MP బోకె మరియు 2MP మాక్రో కెమెరాతో పాటు పెద్ద సెన్సార్ అందిస్తున్నారు. సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 16MP క్వాలిట‌తో ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు. బ్యాక్‌సైడ్ కెమెరా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) మరియు స్టెబిలైజేషన్ అల్గారిథమ్‌లకు కూడా స‌పోర్టు ఇస్తుంది. త‌ద్వారా ఇది స్థిరమైన మరియు స్పష్టమైన వీడియోలను అందిస్తుంది. జాగింగ్ లేదా సైక్లింగ్ లేదా ప్ర‌యాణాలు చేసే స‌మ‌యాల్లో కూడా యూజ‌ర్లు స్థిరమైన వీడియోలు తీయ‌వ‌చ్చు.

అదనంగా, కెమెరా సామర్థ్యాలను మెరుగుపరచడానికి, స్మార్ట్‌ఫోన్ సూపర్ నైట్ కెమెరా మోడ్, మల్టీ స్టైల్ పోర్ట్రెయిట్ మోడ్, రియర్ కెమెరా వంటి ఫీచర్లు క‌లిగి ఉంది. అన్ని vivo డివైజ్‌ల మాదిరిగానే, vivo Y35 కూడా 'మేక్ ఇన్ ఇండియా' పట్ల vivo యొక్క నిబద్ధతను అనుసరిస్తుంది. మరియు వివో యొక్క గ్రేటర్ నోయిడా కేంద్రం వీటిని త‌యారు చేయ‌డం జ‌రిగిన‌ట్లు కంపెనీ పేర్కొంది.

vivo Y35 లాంచ్ సంద‌ర్భంగా వివో బ్రాండ్ స్ట్రాటజీ హెడ్ యోగేంద్ర శ్రీరాముల మాట్లాడుతూ.. "అందరికీ, మేము కొత్త vivo Y35ని పరిచయం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాము. ఈ మొబైల్‌ అన్ని విధాలా గొప్ప ఫీచ‌ర్ల‌తో యూజ‌ర్ల‌ను సంతృప్తి ప‌రుస్తుంది." అని ఆయ‌న పేర్కొన్నారు.

Best Mobiles in India

English summary
Vivo Y35 Mobile with Snapdragon 680 processor Launched in india.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X