Home
Mobile

బడ్జెట్‌ ధరలో 6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్‌ రెసిస్టెన్స్‌తో 5G స్మార్ట్‌ఫోన్!

Vivo Y39 5G Smartphone : వివో సంస్థ ఈ సంవత్సరం తొలిభాగంలో వివో Y39 5G స్మార్ట్‌ఫోన్‌ ను లాంచ్‌ చేసింది. బడ్జెట్ ధరలో భారీ బ్యాటరీతోపాటు మిలిటరీ గ్రేడ్‌ రెసిస్టెన్స్ ను కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 OS, స్నాప్‌డ్రాగన్‌ చిప్‌, 50MP కెమెరాలను కలిగి ఉంది. ఈ ప్రస్తుతం డిస్కౌంట్‌ ఆఫర్‌ లో అందుబాటులో ఉంది.

వివో Y39 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.16,999, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.18,999 గా ఉంది. 256GB స్టోరేజీ వేరియంట్‌ పై ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.500 డిస్కౌంట్‌ ను అందిస్తోంది.

vivo Y39 5G smartphone

కలర్‌ వేరియంట్స్‌ :
దీంతోపాటు ఇతర బ్యాంకు కార్డులపైనా తగ్గింపును అందిస్తోంది. ఈ ఒప్పో Y39 5G స్మార్ట్‌ఫోన్‌ లోటస్‌ పర్పుల్‌, ఓషియల్‌ బ్లూ కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది.

వివో ఫోన్‌ డిస్‌ప్లే వివరాలు :
వివో Y39 5G స్మార్ట్‌ఫోన్‌ 6.68 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌, 264 ppi పిక్సల్‌ డెన్సిటీని కలిగి ఉంది. IP64 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

స్నాప్‌డ్రాగన్‌ చిప్‌, ఆండ్రాయిడ్‌ 15 OS :
ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 SoC ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 8GB LPDDR4x ర్యామ్‌, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. వర్చువల్‌ ర్యామ్ ఆప్షన్‌ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తోంది.

3 సంవత్సరాల అప్‌డేట్స్‌ :
ఈ వివో స్మార్ట్‌ఫోన్‌ 2 ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది. ఈ ఫోన్‌ సర్కిల్‌ టు సెర్చ్‌, జెమిని వాయిస్‌ అసిస్టెంట్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు మెరుగైన ఆడియో క్వాలిటీ కోసం AI ఆడియో అల్గారిథం కూడా ఉంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్‌ వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. 50MP సోనీ HD ప్రైమరీ కెమెరా, 2MP బొకేష్ లెన్స్‌ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను అమర్చి ఉంది. ప్రైమరీ కెమెరా EIS ( ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ ) ను సపోర్టు చేస్తుంది. AI Erase, AI Photo Enhance వంటి ఫీచర్లున్నాయి.

6500mAh బ్యాటరీ :
వివో Y39 5G స్మార్ట్‌ఫోన్‌ 44W వైర్ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ 5G, 4G, బ్లూటూత్‌ 5.0, Wi-Fi, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టు వంటివి కలిగి ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
vivo Y39 5G smartphone with 6500mAh battery now available with bank discounts on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X