బడ్జెట్ ధరలో వివో నుంచి మరో స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ, కలర్ వేరియంట్స్ వివరాలు వెల్లడి..!
Vivo Y400 5G Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ల తయారీ సంస్థ వివో నుంచి జులై 31 వ తేదీన వివో T4R స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ రూ.20 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వస్తుంది. క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. SGS సర్టిఫికేషన్‌ను కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది.
ఈ ఫోన్ 50MP OIS పైమరీ కెమెరా, 2MP బొకేష్ కెమెరాలను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. విడుదల అనంతరం వివో ఇండియా ఇ-స్టోర్ తోపాటు ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది.

వివో నుంచి మరో ఫోన్ :
అయితే వివో నుంచి త్వరలో మరో స్మార్ట్‌ఫోన్ కూడా విడుదల కానుంది. తాజాగా ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. వివో Y400 ప్రో మోడల్ ఇటీవల విడుదల అయింది. త్వరలో వివో Y400 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఈ హ్యాండ్‌సెట్ విడుదల తేదీ, కలర్ వేరియంట్స్ సహా మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ బడ్జెట్ రేంజ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఎప్పుుడు విడుదల కానుంది :
భారత్ మార్కెట్ లో వివో Y400 స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 4 వ తేదీన భారత్ మార్కెట్ లో విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆలివ్ గ్రీన్, గ్లామ్ వైట్ కలర్ వేరియంట్స్ లో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది.
లిస్టింగ్ ఆధారంగా :
వివో ఇండోనేషియా వెబ్‌సైట్ ద్వారా ఈ ఫోన్ కీలక వివరాలు వెల్లడయ్యాయి. అయితే గ్లోబల్ మార్కెట్లో 4G వేరియంట్ గా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. అయితే భారత్ మార్కెట్ లో 5G వేరియంట్‌గానే విడుదల కానుంది.
వివో Y400 5G వివరాలు :
వివో ఇండోనేషియా లిస్టింగ్ ఆధారంగా వివో Y400 స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 100 % DCI P3 కలర్ శాచురేషన్‌ను కలిగి ఉంటుంది. ఫోన్ కెమెరా విభాగం పరంగా 50MP IMX852 ప్రైమరీ కెమెరా, 2MP బొకేష్ కెమెరాలను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ AI ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్, AI క్యాప్షన్స్, AI డాక్యుమెంట్, సర్కిల్ టూ సెర్చ్, AI నోట్స్ సమ్మరీ వంటి అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉండనుంది. IP68 + IP69 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది.
ఈ ఇండోనేషియాలో 6000mAh బ్యాటరీతో విడుదల కానుంది. దీంతోపాటు 4 సంవత్సరాల వరకు మెరుగైన బ్యాటరీ లైఫ్ ను అందించనుంది. అయితే భారత్ లో వివో Y400 ఎలాంటి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు కలిగి ఉంటుందో త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








