6000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, 50MP సోనీ కెమెరాతో వివో Y400 5G స్మార్ట్‌ఫోన్..!
Vivo Y400 5G Smartphone : వివో Y400 5G స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో ఇవాళ విడుదల అయింది. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ రెండు కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.
వివో Y400 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ 6.67 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో వచ్చింది. 1080 x 2400 పిక్సల్స్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ సర్కిల్ టూ సెర్చ్, AI సూపర్ లింక్, AI నోట్ అసిస్ట్, స్క్రీన్ ట్రాన్స్‌లేషన్, AI సూట్, AI ట్రాన్స్‌స్క్రిప్ట్ అసిస్ట్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది.
50MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ వివో హ్యాండ్‌సెట్ వెనుక వైపు 50MP సోనీ IMX852 ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్ 32MP కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ అండర్ వాటర్ ఫోటోగ్రఫీ మోడ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫీచర్‌తో రీల్స్ క్యాప్చర్ చేయడం, సెల్ఫీ, స్లో మోషన్ వీడియోలను కూడా ఈ మోడ్‌లో క్యాప్చర్ చేయవచ్చు.
6000mAh బ్యాటరీ :
ఈ వివో హ్యాండ్‌సెట్ Y400 5G హ్యాండ్‌సెట్ 90W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 1-50 శాతం ఛార్జింగ్‌ను కేవలం 20 నిమిషాల్లో చేయవచ్చని వివో చెబుతోంది. ఈ ఫోన్ బైపాస్ ఛార్జింగ్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది.
భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మెరుగైన ఆడియో కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా వివో హ్యాండ్‌సెట్ 5G, 4G LTE, బ్లూటూత్, వైఫై, GPS, OTG, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.
వివో Y400 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
వివో Y400 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.21999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ గ్లామ్ వైట్, ఓలివ్ గ్రీన్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది.
ఈ ఫోన్ సేల్ ఆగస్టు 7 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. వివో ఇండియా ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. SBI, యెస్ బ్యాంకు, IDFC బ్యాంకు, DBS, బ్యంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంకు కార్డులపై 10 శాతం క్యా్ష్‌బ్యాక్‌ను పొందవచ్చు. 10 నెలలపాటు EMI ఆఫర్, జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కొనుగోలుపై TWS 3e ANC ఇయర్‌బడ్స్ రూ.1499 కే పొందవచ్చు.


Click it and Unblock the Notifications








