Home
Mobile

ఇవాళే వివో Y400 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. 6000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్‌ చిప్‌సెట్‌, 50MP కెమెరా..?

వివో నుంచి భారత్‌ మార్కెట్‌లోకి Y400 5G స్మార్ట్‌ఫోన్‌ (Vivo Y400 5G Smartphone) ఇవాళ (ఆగస్టు 4) న విడుదల కానుంది. ఇప్పటికే వివో ఫోన్‌కు సంబంధించిన అనేక స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలను వెల్లడించింది. అయితే ఇటీవల ఈ స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు కూడా లీక్ అయ్యాయి.

ధర వివరాలు లీక్‌ :
వివో Y400 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుందని తెలుస్తోంది. ఇందులో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌ ఉన్నాయి. ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ.26999 గా ఉంటుందని లీక్స్‌ ద్వారా తెలిసింది. అదే హై ఎండ్‌ మోడల్ ధర రూ.28999 గా ఉంటుందని తెలుస్తోంది.

Vivo Y400 5G smartphone launching today

అయితే ఈ ఫోన్‌ మార్కెట్‌ ఆపరేటింగ్ ధరలు మాత్రం రూ.21999, రూ.23999 గా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే బ్యాంకు కార్డులు, తొలి సేల్‌ ఆఫర్లతో ఈ హ్యాండ్‌సెట్‌ ధరలు రూ.20754, రూ.22741 గా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

వివో y400 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల ఫ్లాట్‌ ఫుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్ 4 జెన్‌ 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుందని తెలుస్తోంది.

కెమెరా విభాగం పరంగా ఈ వివో స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

అయితే ఈ ఫోన్‌ భారీ బ్యాటరీ, మెరుగైన ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది. 90W ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో లాంచ్‌ కానుందని అంచనా వేస్తున్నారు. ఓలివ్‌ గ్రీన్‌, గ్లామ్ వైట్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

* గత వారం వివో నుంచి T4R 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ 6.77 అంగుళాల ఫుల్‌ HD+ క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 SoC చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత FuntouchOS 15 ను కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 2MP బొకేష్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. వెనుక, ముందు కెమెరాలతో 4K రిజల్యూషన్‌తో వీడియోలను రికార్డు చేయవచ్చు. సర్కిల్‌ టూ సెర్చ్‌, AI డాక్యుమెంట్, AI నోట్‌ అసిస్ట్, AI స్క్రీన్‌ ట్రాన్స్‌లేషన్, AI ట్రాన్స్‌స్క్రిప్ట్‌ ఫీచర్లున్నాయి.

ఈ ఫోన్ 44W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5700mAh బ్యాటరీని కలిగి ఉంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది. \ MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.19,499, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.21,499, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,499 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo Y400 5G smartphone launching today in india here are the expected features and specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X