Home
Mobile

ఇవాళ్టి నుంచే వివో Y400 5G స్మార్ట్‌ఫోన్‌ సేల్‌.. 6000mAh బ్యాటరీ, ఆకట్టుకొనే డిజైన్‌ సహా..!

Vivo Y400 5G Smartphone Sale : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో నుంచి ఇటీవల వివో Y400 5G ఫోన్‌ ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ రూ.20 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ 6000mAh బ్యాటరీతోపాటు బెస్ట్ వాటర్‌ ప్రూఫ్‌ మోడల్‌గా ఉంది. ఈ వివో స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది.

వివో Y400 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.21999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.23999 గా ఉంది. ఇవాళ్టి నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. వివో ఇండియా ఇ-స్టోర్‌, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంటుంది.

Vivo Y400 5G Smartphone

రెండు కలర్ వేరియంట్స్‌ :
ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై 10 శాతం తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు నోకాస్‌ EMI, జీరో డౌన్‌ పేమెంట్‌ ఆప్షన్‌లు కూడా ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌ గ్లామ్ వైట్‌, ఓలివ్‌ గ్రీన్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది.

చిప్‌సెట్‌ వివరాలు :
వివో Y400 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్‌ 2 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తుంది.

బెస్ట్‌ వాటర్‌ ప్రూఫ్‌ ఫోన్ :
ఈ వివో ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్‌ మరియు మెరుగైన వాటర్‌ రెసిస్టెంట్‌ ఫోన్‌గా ఉంది. ఈ ఫోన్ భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

Vivo Y400 5G Smartphone

అండర్‌ వాటర్‌ ఫోటోగ్రఫీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 50MP సోనీ IMX852 ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్‌ సెన్సార్‌, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ వివో హ్యాండ్‌సెట్‌ అండర్‌ వాటర్‌ ఫోటోగ్రఫీ మోడ్‌ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా నీటిలోపల కూడా ఫోటోలు, వీడియోలను క్యాప్చర్‌ చేయవచ్చు.

6000mAh బ్యాటరీ :
ఈ వివో y400 5G స్మార్ట్‌ఫోన్ 90W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఛార్జర్‌ను ఉపయోగించి కేవలం 20 నిమిషాల్లోనే 1-50 శాతం ఛార్జింగ్‌ చేయవచ్చని వివో చెబుతోంది. దీంతోపాటు ఈ ఫోన్‌ బైపాస్‌ ఛార్జింగ్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తుందని తెలిపింది.

Vivo Y400 5G Smartphone

ఈ ఫోన్‌ సర్కిల్‌ టూ సెర్చ్‌, AI Super Link, AI Note Assist, స్క్రీన్‌ ట్రాన్స్‌లేషన్, AI సూట్‌, AI ట్రాన్స్‌స్క్రిప్ట్‌ అసిస్ట్ వంటి AI (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ఫీచర్‌లను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌, WiFi, GPS, OTG, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లను అమర్చారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo Y400 5G Smartphone sale to start from today in india here is the bank deal
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X