50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, FHD+ డిస్‌ప్లే Vivo 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.1500 డిస్కౌంట్!
వివో సంస్థ భారత్ మార్కెట్‌లో గత సంవత్సరం డిసెంబర్ లో వివో X300 సిరీస్ విడుదల అయింది. అనంతరం ఈ సంవత్సరం జనవరి నెలలో వివో X200T హ్యాండ్‌సెట్ విడుదల అయింది. ఈ వారంలోనే వివో V70 సిరీస్ విడుదల కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా వివో V70, వివో V70 ఇలైట్ మోడల్స్ లాంచ్ కానున్నాయి. Zeiss భాగస్వామ్యంతో కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు కూడా వెల్లడయ్యాయి.
వివో సంస్థ గత సంవత్సరం వివో Y400 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా అందుబాటులోకి వచ్చిన వివో Y400 5G స్మార్ట్‌ఫోన్‌ను (Vivo Y400 5G Smartphone) ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, మెరుగైన ఆడియో కోసం స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.

రూ.1500 డిస్కౌంట్ :
వివో Y400 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ధర 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.22999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.24999 గా ఉంది. అమెజాన్‌లో ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.1500 డిస్కౌంట్‌ను పొందవచ్చు.
డిస్‌ప్లే వివరాలు :
వివో Y400 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల (1080 x 2400 పిక్సల్స్) FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఓలివ్ గ్రీన్, గ్లామ్ వైట్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది. 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 3 ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలున్నాయి. ఇందులో 50MP సోనీ IMX852 ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉంది. ఫోటోగ్రఫీ పరంగా అనేక ప్రత్యేక ఫీచర్లున్నాయి.

6000mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ సర్కిల్ టు సెర్చ్, ఏఐ సూపర్ లింక్, స్క్రీన్ ట్రాన్స్‌లేషన్, ఏఐ సూట్, ఏఐ ట్రాన్స్‌స్క్రిప్ట్, ఏఐ నోట్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ వివో ఫోన్ 90W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కేవలం 20 నిమిషాల్లో 1-50 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చని వివో చెబుతోంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, GPS, వైఫై, OTG, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. IP68, IP69 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మెరుగైన ఆడియో కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








