Home
Mobile

ఈ ఫోన్‌పై రూ.2000 డిస్కౌంట్‌.. 3D కర్వడ్‌ డిస్‌ప్లే, 50MP కెమెరా, 5500mAh బ్యాటరీ సహా..!

వివో సంస్థ ఈ సంవత్సరం భారత్‌ మార్కెట్‌లో అనేక ఫోన్‌లను లాంచ్‌ చేసింది. ఇందులో T4, V50, V60 సిరీస్‌లతోపాటు Y సిరీస్‌లో కూడా అనేక మోడల్స్‌ను లాంచ్‌ చేసింది. Y సిరీస్‌లో ఎంట్రీ లెవల్‌, బడ్జెట్‌, మిడ్‌ రేంజ్‌లో ఫోన్‌లను తీసుకొచ్చింది. అయితే వివో Y400 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (Vivo Y400 Pro 5G Smartphone) ఈ సంవత్సరం జూన్‌లో విడుదల అయింది. ప్రస్తుతం రూ.2000 డిస్కౌంట్‌ ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.

రూ.2000 డిస్కౌంట్‌ :
ప్రస్తుతం వివో Y400 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ వివో ఇ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.25999, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.27999 గా ఉంది. వివో వెబ్‌సైట్‌లో యాక్సెస్‌, HDFC బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను అందిస్తోంది.

Vivo Y400 Pro 5G Smartphone

కలర్‌ వేరియంట్స్‌ :
అదే ఫ్లిప్‌కార్ట్‌లో ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఫెస్ట్‌ గోల్డ్‌, ఫ్రీస్టైల్‌ వైట్‌, నెబులా పర్పుల్‌ కలర్‌ వేరియంట్స్‌లో భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది.

వివో Y400 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ పూర్తి వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్‌ 6.77 అంగుళాల FHD+ 3D కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 300Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే వెట్‌ టచ్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. అంటే తడి చేతులతోనూ వినియోగించుకోవచ్చు.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌ 8GB LPDDR4X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

50MP కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP సోనీ IMX882 ప్రైమరీ, 2MP సెకండరీ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తాయి.

ఫాస్ట్‌ ఛార్జింగ్‌, AI ఫీచర్లు :
ఈ ఫోన్‌ 90W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్ సర్కిల్‌ టు సెర్చ్‌, ఏఐ స్క్రీన్‌ ట్రాన్స్‌లేషన్‌, ఏఐ స్క్రీన్‌ ట్రాన్స్‌లేషన్‌, ఏఐ సూపర్‌ లింక్‌, ఏఐ నోట్‌ అసిస్ట్‌, AI Erase 2.0, AI Photo Enhance వంటి వీచర్లు ఉన్నాయి.

కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్‌ 5.4, వైఫై, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌ IP65 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 7.49mm థిక్‌నెస్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo Y400 Pro 5G Smartphone gets Rs2000 discount on flipkart, vivo e- store
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X