Home
Mobile

Vivo Y400 Pro 5G స్మా్ర్ట్‌ఫోన్‌ విడుదల.. 50MP కెమెరా, 5500mAh బ్యాటరీ, 3D కర్వడ్ డిస్‌ప్లే..!

Vivo Y400 Pro 5G Smartphone Launched : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో భారత్ మార్కెట్‌లో ఇవాళ వివో Y400 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌ 7.49mm థిక్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ మిడ్‌రేంజ్ ధర వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. మరియు మూడు కలర్‌ వేరియంట్స్‌లో లాంచ్‌ అయింది. ఇవాళ్టి నుంచే ఈ ఫోన్‌ను ముందస్తు బుకింగ్‌ చేసుకొనేందుకు అవకాశం కల్పించింది.

వివో Y400 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ వివో ఫోన్‌ 6.77 అంగుళాల ఫుల్‌ HD+ 3D కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే తో లాంచ్ అయింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌, 300Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది.

Vivo Y400 Pro 5G smartphone telugu news

చిప్‌సెట్, OS వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 8GB LPDDR4X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 ను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ AI Photo Enhance, AI Erase 2.0 ఫీచర్‌లతోపాటు సర్కిల్‌ టూ సెర్చ్‌, AI సూపర్‌ లింక్‌, AI స్క్రీన్ ట్రాన్స్‌లేషన్‌, AI Transcript Assist, AI నోట్‌ అసిస్ట్‌ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లున్నాయి. 90W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

Vivo Y400 Pro 5G smartphone telugu news

కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో f/1.79 అపేచర్‌తో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, f/2.4 అపేచర్‌తో 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం f/2.5 అపేచర్‌తో 32MP కెమెరాను అమర్చారు.

ఈ కెమెరాలు 4K రిజల్యూషన్‌తో వీడియో రికార్డింగ్‌ ను సపోర్టు చేస్తాయి. మరియు కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ 5G, 4G, బ్లూటూత్‌ 5.4, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

Vivo Y400 Pro 5G smartphone telugu news

వివో Y400 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
వివో Y400 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24999 గా ఉంది. అదే 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26999 గా ఉంది.

ముందస్తు బుకింగ్ :
ఈ ఫోన్‌ను వివో ఇండియా వెబ్‌సైట్‌ నుంచి ఇవాళ్టి నుంచే ముందస్తు బుకింగ్ (Pre Order) చేసుకొనేందుకు అవకాశం కల్పించింది. ఈ ఫోన్ సేల్‌ జూన్ 27 నుంచి ప్రారంభం కానుంది. వివో ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Take a Poll

HDFC, ICICI, SBI బ్యాంకు కార్డుల ద్వారా EMI లావాదేవీలతో కొనుగోలు చేస్తే గరిష్ఠంగా రూ.2500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్‌ జూన్‌ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌ ఫ్రీస్టైల్‌ వైట్‌, పెస్ట్‌ గోల్డ్‌, నెబులా పర్పుల్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Vivo Y400 Pro 5G smartphone launched in india with 3D Curved display and 5500mAh Battery
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X