వివో కొత్త ఫోన్ టీజర్ విడుదల.. ఆకట్టుకొనేలా బ్యాక్ ప్యానల్ డిజైన్.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు లీక్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో నుంచి ఇటీవల వివో T4 అల్ట్రా 5G ఫోన్ విడుదల అయింది. మిడ్‌రేంజ్ ధరలో మెరుగైన కెమెరా ఫీచర్‌లతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఫోన్ సేల్ జూన్ 18 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే వివో నుంచి త్వరలో మరో హ్యాండ్‌సెట్ విడుదల కానుంది. వివో Y400 ప్రో 5G పేరుతో (Vivo Y400 Pro 5G) లాంచ్ కానుంది. తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన వివరాలను X పోస్ట్ ద్వారా వివో వెల్లడించించింది.
వివో ఇండియా పేజీ ఆధారంగా కూడా వివరాలు వెల్లడయ్యాయి. తాజా టీజర్ ఆధారంగా భారత్ మార్కెట్‌లో ఈ ఫోన్ త్వరలో విడుదల కానుందని మాత్రమే వెల్లడించింది. కచ్చితమైన విడుదల తేదీని ప్రకటన చేయలేదు. ఈ టీజర్ ద్వారా ఫోన్ బ్యాక్ ప్యానల్ డిజైన్ విడుదల అయింది.

కెమెరా మాడ్యూల్ :
ఈ ఫోన్ వెనుక వైపు పిల్ ఆకారంలో కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. దీంతోపాటు LED ఫ్లాష్ రింగ్ కూడా ఉంది. వైట్ కలర్ వేరియంట్‌లో కనిపిస్తోంది. అయితే కెమెరా స్పెసిఫికేషన్‌ల వివరాలు వెల్లడి కాలేదు. ఈ ఫోన్ నెబులా పర్పుల్, వైట్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
అంచనా వివరాలు :
గతంలో వచ్చిన లీక్స్ ఆధారంగా వివో Y400 ప్రో స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.77 అంగుళాల ఫుల్ HD+ 3D కర్వడ్ అమోరెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ 7.4mm థిక్‌నెస్‌తో లాంచ్ కానుందని సమాచారం.
For those who don’t just dream—but dare, do, and dominate. 💫 This is for the ones who chase their dreams
— vivo India (@Vivo_India) June 13, 2025
The all new vivo Y400 Pro - Coming soon#vivoY400Pro #vivoYseries #ItsMyStyle #DreamChaser pic.twitter.com/4tGk4vKdkJ
వివో Y400 ప్రో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch 15 ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 90W ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో అందుబాటులో వచ్చే అవకాశం ఉంది.
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుందని సమాచారం. ఇందులో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 2MP కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32MP కెమెరాలో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
ఇటీవల విడుదల అయిన వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల 1.5K క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch 15 పైన పనిచేస్తోంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఈ ఫోన్ 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా (OIS), 8MP అల్ట్రావైడ్, 3x ఆప్టికల్ జూమ్, 10x టెలిఫోటో మ్యాక్రో జూమ్, 100x డిజిటల్ జూమ్‌తో 50MP సోనీ IMX882 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.37999 గా ఉంది. ఈ ఫోన్ సేల్ జూన్ 18 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications