Home
Mobile

రూ.2000 డిస్కౌంట్‌.. 3D కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 4 సంవత్సరాల అప్‌డేట్స్‌, 50MP కెమెరా 5G ఫోన్!

భారత్‌ మార్కెట్‌ లో వివో X200T స్మార్ట్‌ఫోన్‌ జనవరి 27 వ తేదీన విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ గురించి ఇప్పటికే అనేక వివరాలు వెల్లడయ్యాయి. అయితే గత సంవత్సరం వివో నుంచి అనేక స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. Y సిరీస్‌ మోడల్స్‌తోపాటు T4, V50, V60 సిరీస్‌ లో అనేక స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే గత సంవత్సరం విడుదల అయిన వివో Y400 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ ను ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

రూ.2000 డిస్కౌంట్‌ :
వివో Y400 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ (Vivo Y400 Pro 5G Smartphone) ప్రస్తుతం వివో వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌ లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.25999, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.27999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠం రూ.2 వేల డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

vivo Y400 pro 5G smartphone with 50MP Camera  90W charging support gets rs2000 discount on flipkart

3D కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే :
వివో Y400 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.77 అంగుళాల FHD+ 3D కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లే 4500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 300Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే వెట్‌ టచ్‌ సపోర్టును కలిగి ఉంది. అంటే తడి చేతులతోనూ ఈ డిస్‌ప్లేను నియంత్రించుకోవచ్చు.

4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ :
ఈ వివో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 8GB LPDDR4X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది.

50MP సోనీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. 50MP సోనీ IMX882 ప్రైమరీ, 2MP సెకండరీ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ కెమెరాలతో 4K వీడియో రికార్డింగ్‌ చేయవచ్చు.

ఫాస్ట్‌ ఛార్జింగ్ :
వివో Y400 ప్రో 5G ఫోన్ ఏఐ స్క్రీన్‌ ట్రాన్స్‌లేషన్‌, AI Super link, AI Note Assist, AI Erase 2.0, AI Photo Enhance వంటి వీచర్లు ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ 90W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

ఈ ఫోన్‌ ఫెస్ట్‌ గోల్డ్‌, ఫ్రీ స్టైల్‌ వైట్‌, నెబులా పర్పుల్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. IP65 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. 5G, 4G, Wi-Fi, బ్లూటూత్‌ 5.4, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
vivo Y400 pro 5G smartphone with 50MP Camera, 90W charging support gets rs2000 discount on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X