Home
Mobile

రూ.20 వేల ధర రేంజ్‌లో వివో నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌.. ఎప్పుడు విడుదల కానుందంటే?

వివో నుంచి ఇటీవల T4 సిరీస్‌ నుంచి వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ సేల్‌ జూన్‌ 18 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే భారత్‌ మార్కెట్‌లోకి వివో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ త్వరలో విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన టీజర్‌ను కూడా వివో ఇటీవల విడుదల చేసింది. అయితే తాజాగా కీలక వివరాలను వెల్లడించింది. వివో Y400 Pro స్మార్ట్‌ఫోన్‌ విడుదల తేదీని సంస్థ వెల్లడించింది.

భారత్‌ మార్కెట్లో వివో Y400 ప్రో స్మార్ట్‌ఫోన్‌ (Vivo Y400 Pro Smartphone) జూన్ 20 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. విడుదల అనంతరం ఈ స్మార్ట్‌ఫోన్‌ వివో ఇండియా ఇ-స్టోర్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సహా ఇతర ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ రూ.20 కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

Vivo Y400 Pro Smartphone launch date

3D కర్వడ్‌ డిస్‌ప్లే :
వివో Y400 ప్రో స్మార్ట్‌ఫోన్‌ కు సంబంధించిన ప్రొడక్ట్‌ పేజీని కూడా వివో ప్రారంభించింది. దీని ఆధారంగా ఈ ఫోన్ డిజైన్‌ వెల్లడయింది. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ 3D కర్వడ్‌ డిస్‌ప్లేతో కూడిన స్లిమ్‌ డిజైన్‌తో లాంచ్‌ కానుంది. కొన్ని రిపోర్టుల ఆధారంగా ఈ ఫోన్‌ 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

కెమెరా వివరాలు :
ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 4500 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. కెమెరా విభాగం పరంగా వృత్తాకాల Aura లైట్‌తో కూడిన డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరాతోపాటు 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.

5500mAh బ్యాటరీ :
సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ ఫోన్‌ 32MP కెమెరాతో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ కెమెరా యూనిట్‌ IR బ్లాస్టర్‌ ను కూడా కలిగి ఉంది. మరియు వివో Y400 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 90W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ వివో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజీ సపోర్టు చేస్తుందని సమాచారం. OS వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ఫోన్‌ స్టోరేజీ వేరియంట్స్‌ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

* వివో T4 సిరీస్‌లో ఇటీవల అందుబాటులోకి వచ్చిన వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.37999 గా ఉంది. ఈ ఫోన్‌ సేల్ జూన్‌ 18 న ప్రారంభం కానుంది. వివో ఇండియా ఇ-స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6.67 అంగుళాల 1.5K క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ SoC చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch 15 ను కలిగి ఉంది. 50MP సోనీ IMX921 (OIS), 8MP అల్ట్రావైడ్‌, 50MP సోనీ IMX882 పెరిస్కోప్‌ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. మరియు 32MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 90W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Vivo Y400 Pro Smartphone launch date revealed in india here are the expected specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X