Home
Mobile

వివో నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌.. భారీ బ్యాటరీ, కొత్త ప్రాసెసర్‌, AI కెమెరా వంటి ఫీచర్లతో..?

Vivo Y51 Pro 5G Smartphone : వివో నుంచి భారత్‌ మార్కెట్‌ లో T5 సిరీస్‌ లో భాగంగా T5x 5G స్మార్ట్‌ఫోన్‌ త్వరలో లాంచ్ కానుంది. ఇందుకు సంబంధించిన అనేక వివరాలు ఇటీవలే లీక్‌ అయ్యాయి. దీంతోపాటు త్వరలో మరో హ్యాండ్‌సెట్‌ కూడా లాంచ్‌ కానుంది. వివో Y51 ప్రో స్మార్ట్‌ఫోన్‌ పేరుతో విడుదల కానుంది. ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్‌లతోపాటు ధర వివరాలు లీక్‌ అయ్యాయి.

టిప్‌స్టర్‌ పరాస్‌ గుగ్‌లానీ ఈ వివో ఫోన్ వివరాలను షేర్‌ చేశారు. అయితే వివో ఇప్పటి వరకు ఈ హ్యాండ్‌సెట్‌ విడుదలపై ఎటువంటి అధికారిక వివరాలు వెల్లడించలేదు. టిప్‌స్టర్‌ విడుదల చేసిన మార్కెటింగ్‌ పోస్టర్ ఆధారంగా వివో Y51 ప్రో స్మార్ట్‌ఫోన్ ఐకూ Z11x 5G డిజైన్‌ ను పోలి ఉంది.

Vivo Y51 Pro 5G

కెమెరా మాడ్యుల్‌ :
ఈ వివో ఫోన్‌ వెనుక వైపు దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్‌ తో రెండు కెమెరాలను కలిగి ఉంటుందని టిప్‌స్టర్ చెబుతున్నారు. ఈ ఫోన్‌ నోబెల్‌ గోల్డ్‌, ఫెస్టివ్‌ రెడ్‌ కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులోకి రానుందని తెలిపారు.

మీడియాటెక్ చిప్‌! :
కొన్ని లీక్స్‌ ఆధారంగా వివో Y51 ప్రో స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7360 ప్రాసెసర్‌ తో పనిచేస్తుందని తెలుస్తోంది. డైమెన్సిటీ 7300 చిప్‌నకు రీబ్రాండెడ్‌ వెర్షన్‌ గా తెలుస్తోంది. ఈ ప్రాసెసర్ 9,80,000 AnTuTu స్కోర్‌ ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌! :
ఈ Y51 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 1250 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు మిలిటరీ గ్రేడ్‌, SGS సర్టిఫికేషన్‌ తో లాంచ్‌ కానుందని టిప్‌స్టర్‌ తెలిపారు. దీంతోపాటు IP68, IP69 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంటుందని చెప్పారు.

50MP AI కెమెరా :
ప్రస్తుతం భారత్‌ లో అనేక బ్రాండ్‌లు భారీ బ్యాటరీలతో లాంచ్ అవుతున్నాయి. ఈ ట్రెండ్‌ ను కొనసాగిస్తూ ఈ ఫోన్‌ 7200mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. కెమెరా విభాగం పరంగా 50MP AI ప్రైమరీ కెమెరాతో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ కెమెరా 4K వీడియో రికార్డింగ్‌ ను సపోర్టు చేస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్‌ స్పీకర్లను కలిగి ఉంటాయని తెలుస్తోంది. 400% వాల్యూమ్‌ ను సపోర్టు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ OriginOS 6 పైన పనిచేస్తుందని టిప్‌స్టర్‌ చెబుతున్నారు. దీంతోపాటు ఆరిజన్ ఐలాండ్‌, ఏఐ క్రియేషన్‌, ప్రైవేట్‌ సేఫ్‌ వంటి ఫీచర్లను కూడా సపోర్టు చేస్తుంది.

వివో Y51 ప్రో స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌ లో లాంచ్ కానుందని తెలుస్తోంది. తొలిసేల్‌ లో భాగంగా గరిష్ఠంగా రూ.2500 డిస్కౌంట్‌ ను పొందుతుందని భావిస్తున్నారు. దీంతోపాటు నోకాస్ట్ EMI ఆప్షన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ వివరాలపై వివో ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo Y51 Pro 5G Smartphone key specifications and prices tipped in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X