Home
Mobile

కిందపడినా, 30 నిమిషాలు నీటిలో ఉన్నా డ్యామేజీ కాని స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. రూ.2500 క్యాష్‌బ్యాక్‌..!

భారత్‌ మార్కెట్‌లో వివో ఇటీవలే V70, V70 ఇలైట్‌ మోడల్స్‌ లాంచ్‌ అయ్యాయి. తాజాగా వివో Y51 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ (Vivo Y51 Pro 5G Smartphone) విడుదల అయింది. మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ 7200mAh భారీ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS ని కలిగి ఉంది. తొలి సేల్‌లో భాగంగా రూ.2500 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

వివో Y51 ప్రో 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ ఫోన్ 6.75 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1250 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే TUV Rheinland Low బ్లూ లైట్‌ సర్టిఫికేషన్‌, ఐ ప్రొటెక్షన్‌ మోడ్‌ కూడా ఉంది.

Vivo Y51 Pro 5G launch telugu news

అండర్‌ వాటర్‌ ఫోటోగ్రఫీ :
ఈ హ్యాండ్‌సెట్‌ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. 1.5 మీటర్ల లోతు నీటిలో 30 నిమిషాల వరకు అండర్‌ వాటర్‌ ఫోటోగ్రఫీని సపోర్టు చేస్తుంది. SGS 5 స్టార్‌ ప్రీమియం సపోర్టును కలిగి ఉంది. ఫలితంగా 1.7 మీటర్ల నుంచి కిందపడినా డ్యామేజీ కాకుండా ఉంటుందని చెబుతోంది.

మీడియాటెక్‌ చిప్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ 4nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 7360 టర్బో చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 9,20,000 AnTuTu స్కోర్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌ 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తుంది.

Vivo Y51 Pro 5G launch telugu news

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ లెన్స్ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరా ఉంది. ఈ ఫోన్‌ 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. స్థిరమైన సిగ్నల్‌ కోసం AI సూపర్‌ లింక్‌ ఫీచర్‌ ఉంది.

భారీ బ్యాటరీ :
వివో Y51 ‌ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 44W ఫ్లాష్‌ ఛార్జ్‌ సపోర్టుతో 7200mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌ రివర్స్‌, బైపాస్‌ ఛార్జింగ్‌ సపోర్టును కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ AI క్రియేషన్‌, AI నోట్స్, AI ట్రాన్స్‌స్క్రిప్ట్‌ అసిస్ట్, AI క్యాప్షన్స్‌, సర్కిల్‌ టు సెర్చ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రైవేట్ స్పెస్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, వైఫై, బ్లూటూత్‌ 5.4, GPS, QZSS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. గైరోస్కోప్‌, ఇ-కాంపాస్, ప్రాక్సిమిటీ సెన్సర్‌, యాంబియంట్ లైట్‌ సెన్సర్‌, యాక్సెలిరోమీటర్‌ సెన్సర్‌లు ఉన్నాయి. ఈ ఫోన్‌ 400 శాతం వాల్యూమ్‌ బూస్ట్‌ ఫీచర్‌తో డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.

వివో Y51 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ :
వివో ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.24999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.27999 గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ ఫోన్‌ వివో ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

ఈ ఫోన్‌ను మార్చి 16 వ తేదీ కంటే ముందుగా కొనుగోలు చేస్తే రూ.2500 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చని తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్ నోబెల్‌ గోల్డ్‌, ఫెస్టివ్‌ రెడ్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo Y51 Pro 5G Smartphone with 7200mAh Battery, MediaTek Dimensity 7360 Turbo Chip Launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X