Home
Mobile

వివో Y51A 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్!! స్నాప్‌డ్రాగన్ 662 SoC, 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లతో

ఇండియాలో పేరుగాంచిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థలలో ఒకటైన వివో 2021 సంవత్సరం ప్రారంభంలో సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌గా వివో Y51A ను నేడు భారత్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 SoC వంటి ఫీచర్లను కలిగి ఉంది. అలాగే ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ను త్రిభుజా కారంలో కలిగి ఉండి వివో Y51 కి అప్ డేట్ వెర్షన్ గా వచ్చే ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వివో Y51A స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

వివో Y51A స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

వివో Y51A సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియాలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఒకే ఒక మోడల్‌లో 17,990 రూపాయల ధర వద్ద విడుదల అయింది. దీనిని టైటానియం బ్లూ మరియు క్రిస్టల్ సింఫనీ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీనిని వివో ఇండియా ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటిఎమ్, టాటాక్లిక్, మరియు మరిన్ని భాగస్వామి రిటైల్ దుకాణాల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

వివో Y51A స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఆఫర్స్

వివో Y51A స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఆఫర్స్

వివో Y51A సరికొత్త స్మార్ట్‌ఫోన్ యొక్క లాంచ్ ఆఫర్లలో భాగంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వినియోగదారులకు రూ.1,000 వరకు క్యాష్‌బ్యాక్ ను అందిస్తుంది. వీటితో పాటుగా Vi ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అలాగే బజాజ్ ఫిన్‌సర్వ్, హోమ్ క్రెడిట్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, హెచ్‌డిబి మరియు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై జీరో డౌన్ పేమెంట్ స్కీమ్ లు కూడా అదనంగా లభిస్తాయి.

వివో Y51A స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

వివో Y51A స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

వివో Y51A సరికొత్త స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫంటౌచ్ OS11 సాఫ్ట్‌వేర్‌తో రన్ అవుతుంది. ఇది 6.58-అంగుళాల ఫుల్-హెచ్‌డి + LCD డిస్‌ప్లేను 1,080x2,408 పిక్సెల్‌ పరిమాణంతో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 SoC చేత శక్తిని పొందుతూ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 8GB ర్యామ్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇందులో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ సాయంతో మెమొరిని 1TB వరకు విస్తరించడానికి అనుమతిస్తుంది.

వివో Y51A కెమెరా సెటప్

వివో Y51A కెమెరా సెటప్

వివో Y51A స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరా సెటప్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో ఎఫ్ / 1.79 లెన్స్ సెన్సార్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఎఫ్ / 2.2 అల్ట్రా-వైడ్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెన్సార్ మరియు ఎఫ్ / 2.4 తో 2 మెగాపిక్సెల్ కెమెరాలు ప్యాక్ చేయబడి ఉన్నాయి. వీటి యొక్క కెమెరాలు పోర్ట్రెయిట్, ఫోటోలెన్స్, వీడియో, పనోరమా, లైవ్ ఫోటో, స్లో-మో, టైమ్ లాప్స్, ప్రో, DOC, సూపర్ నైట్ మోడ్, మరియు AI వంటి కెమెరా మోడ్‌లను కలిగి ఉంటుంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

వివో Y51A 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్

వివో Y51A 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్

వివో వై 51 ఎలో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, యుఎస్‌బి టైప్-సి, జిపిఎస్ మరియు మరిన్ని ఉన్నాయి. ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది మరియు 163.86x75.32x8.38 మిమీ కొలుస్తుంది. వివో వై 51 ఎ బరువు 188 గ్రాముల జాబితాలో ఉంది. వివో Y51A, ప్రాసెసర్ కాకుండా, గత నెలలో భారతదేశంలో ప్రారంభించిన వివో Y51 (5,000mAh) కు సమానంగా ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo Y51A New Smartphone Released in India: Price, Specs, Launch Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X