48MP కెమెరా సెన్సార్‌తో కొత్త Vivo Y52 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్!
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గ్లోబల్ మార్కెట్లో కొత్త మోడల్ మొబైల్స్‌ను క్రమంగా విస్తరిస్తోంది. ఈ కంపెనీ y సిరీస్ నుంచి ఇప్పటికే అనేక ఆకర్షణీయమైన స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేసింది. కాగా, తాజాగా Vivo కొత్త Y52 5G (2022) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 700SoC ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డార్క్ నైట్ మరియు గ్లేసియర్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఇతర ఫీచర్లు ఏమిటో తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చివరి దాకా చదవండి.

Vivo Y52 5G (2022) ధర మరియు లభ్యత:
Vivo Y52 5G (2022) స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం తైవాన్ మార్కెట్‌లో మాత్రమే ప్రారంభించబడింది. కాబట్టి తైవాన్ మార్కెట్‌లో దీని ధర TWD 7,990 (సుమారు రూ.20,492) గా నిర్ణయించారు. స్మార్ట్‌ఫోన్ డార్క్ నైట్ మరియు గ్లేసియర్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. భారతదేశంలో ఈ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు లాంచ్ చేయబడుతుందనే దాని గురించి Vivo ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు.
Vivo Y52 5G (2022) స్పెసిఫికేషన్లు:
Vivo Y52 5G (2022) స్మార్ట్‌ఫోన్ 6.58-అంగుళాల పూర్తి HD IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1080 x 2408 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి 90.6%. ఇది టియర్ డ్రాప్ నాచ్ స్టైల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. Vivo Y52 5G (2022) స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 700SoC ప్రాసెసర్‌తో ఆధారితమైనది మరియు Android 12OSలో రన్ అవుతుంది. ఇది 4GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది. మెమరీ కార్డ్ ద్వారా స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే ఆప్షన్ కూడా ఇందులో ఉంది.

ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్:
Vivo Y52 5G (2022) స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ప్రధాన కెమెరాకు 48 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ఇక రెండవ కెమెరా అల్ట్రా-వైడ్ లెన్స్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ సెన్సార్ కలిగి ఉంది. మూడవ కెమెరాలో 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉంది. ఇందులో LED ఫ్లాష్ కూడా ఉంది. ఇందులో 8 మెగాపిక్సెల్ సెన్సార్ సామర్థ్యం ఉన్న సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
Vivo Y52 5G (2022) స్మార్ట్‌ఫోన్ 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇతర కనెక్టివిటీ ఎంపికలలో హాట్‌స్పాట్ డ్యూయల్ సిమ్, 5G, Wi-Fi, బ్లూటూత్ 5.1, GPS, NFC, USB-C పోర్ట్ మరియు 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. ఇది కాకుండా, ఇందులో యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఉన్నాయి.

గతవారంలో వివో కంపెనీ చైనాలో Vivo Y73t స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. దాని గురించి కూడా తెలుసుకుందాం:
Vivo Y73t మొబైల్ 60Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు 20:9 యాస్పెక్ట్ రేషియోతో, 6.58-అంగుళాల ఫుల్ HD+ (1,080x2,408 పిక్సెల్‌లు) LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేటెడ్ Mali-G57 GPUతో MediaTek డైమెన్సిటీ 700 SoC ద్వారా రన్ అవుతుంది. 12GB వరకు LPDDR4X RAM మరియు 256GB వరకు UFS 2.1 నిల్వ ఉంది. Vivo Y73t ఆండ్రాయిడ్ 11 పై OriginOS ఓషన్ స్కిన్‌తో రన్ అవుతుంది.
ఇక కెమెరాల విషయానికొస్తే.. Vivo Y73t మొబైల్ బ్యాక్ సైడ్ f/1.8 ఎపర్చర్‌తో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. మరొకటి f/2.4 ఎపర్చర్‌తో 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉంది. ముందు భాగంలో, ఇది f/2.0 ఎపర్చర్‌తో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది మరియు 44W FlashCharge ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీని కొలతలు 163.87x75.33x9.17mm మరియు బరువు 201.5g అని కంపెనీ పేర్కొంది. Vivo Y73t అనేది డ్యూయల్-మోడ్ 5G కనెక్టివిటీకి మద్దతు ఇచ్చే డ్యూయల్-సిమ్ 5G హ్యాండ్‌సెట్ అని కంపెనీ వెల్లడించింది.
Vivo Y73t ధర, లభ్యత:
Vivo Y73t ర్యామ్ మరియు స్టోరేజీ ఆధారంగా మూడు కాన్ఫిగరేషన్‌లలో లభించనుంది. 8GB RAM + 128GB స్టోరేజీ, 8GB RAM + 256GB స్టోరేజీ మరియు 12GB RAM + 256GB స్టోరేజీ వంటి వేరియంట్లలో అందుబాటులో ఉంది. Vivo చైనా ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రీ-బుక్ చేయడానికి అందుబాటులో ఉంది. ఈ వేరియంట్‌ల ధర వరుసగా CNY 1,399 (దాదాపు రూ.16,000), CNY 1,599 (దాదాపు రూ.18,500), మరియు CNY 1,799 (దాదాపు రూ.21,000) గా ఉన్నాయి. ఈ Vivo స్మార్ట్‌ఫోన్ ఫాగ్ బ్లూ మరియు మిర్రర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందించబడుతుంది. ఇది అక్టోబర్ 10 నుండి చైనాలో విక్రయించబడుతోంది.


Click it and Unblock the Notifications








