Home
Mobile

6.72 అంగుళాల డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో వివో 5G స్మార్ట్‌ఫోన్‌... డిజైన్‌, స్పెసిఫికేషన్ల వివరాలు..?

వివో నుంచి త్వరలో మరో స్మార్ట్‌ ఫోన్ లాంచ్‌ కానుందని తెలుస్తోంది. భారత్‌లో తన Y సిరీస్‌ హ్యాండ్‌ సెట్‌ వివో Y58 5G స్మార్ట్‌ ఫోన్‌ (Vivo Y58 5G Smartphone) విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ ఈ హ్యాండ్‌ సెట్ గురించి కొన్ని వార్తలు వస్తున్నాయి. X (ట్విట్టర్‌) యూజర్‌ AN Leaks ఇందుకు సంబంధించిన కొన్ని వివరాలను పోస్ట్ చేశారు. ఫలితంగా భారత్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ త్వరలో విడుదల కానుందని తెలుస్తోంది.

దీంతోపాటు ఈ వివో Y58 5G స్మార్ట్‌ఫోన్‌ రెండు రంగుల్లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ వివరాల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ కెమెరా మాడ్యూల్‌ వృత్తాకారంగా ఉండనుంది. మరియు కర్వడ్‌ ఎడ్జ్‌లను కలిగి ఉంటుంది. దీంతోపాటు ముందువైపు పంచ్‌ హోల్‌ డిస్‌ప్లే డిజైన్‌ను కలిగి ఉంటుంది.

Vivo Y58 5G Smartphone could launch in india soon

వివో Y58 5G స్మార్ట్‌ ఫోన్‌ అంచనా స్పెసిఫికేషన్‌లు..:
వివో Y58 5G స్మార్ట్‌ ఫోన్ 6.72 అంగుళాల పుల్ HD+ డిస్‌ప్లే ను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌ మరియు 1024 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ తో రానుందని తెలుస్తోంది. దీంతోపాటు AN Leaks ఫోటోల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది.

ఈ వివో హ్యాండ్‌ సెట్‌ స్నాప్‌ డ్రాగన్ 4 జెన్ 2 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజీతో జతచేయబడి ఉంటుందని తెలుస్తోంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పొడిగించుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్‌ 14 పైన పనిచేస్తే అవకాశం ఉంది.

50MP ప్రధాన కెమెరా! :
కెమెరా విభాగం పరంగా వివో Y58 5G స్మార్ట్‌ ఫోన్ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రధాన కెమెరా, 2MP కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.

44W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీ..! :
దీంతోపాటు ఈ వివో Y58 5G స్మార్ట్‌ ఫోన్‌ భద్రత కోసం ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌, డ్యూయల్‌ స్పీకర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌ గా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు 44W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Vivo Y58 5G Smartphone expected to launch soon in india specifications features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X